ఆలస్యం కాకముందే ఆ ఇద్దరినీ ఆడించండి... ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లకు పెరుగుతున్న...

Published : Jun 13, 2022, 01:32 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఎంపికయ్యారు యంగ్ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్. అయితే మొదటి రెండు టీ20 మ్యాచుల్లో సీనియర్లకు అవకాశం ఇచ్చిన టీమిండియా, ఈ యంగ్ పేసర్లకు తుదిజట్టులో చోటు కల్పించలేదు..

PREV
16
ఆలస్యం కాకముందే ఆ ఇద్దరినీ ఆడించండి... ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లకు పెరుగుతున్న...

ఉమ్రాన్ మాలిక్, ఐపీఎల్ 2022 సీజన్‌లో 150+ కి.మీ.ల వేగంతో మెరుపు బౌలింగ్ చేసి, ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సీజన్‌లో 22 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, ఓ మ్యాచ్‌లో ఐదు, మరో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి మోస్ట్ మెమొరబుల్ సీజన్‌గా మలుచుకున్నాడు...

26

అర్ష్‌దీప్ సింగ్ 14 మ్యాచుల్లో కలిపి 10 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌లో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్, సీజన్‌ మొత్తంలో కలిసి చివరి ఓవర్లలో ఒకే ఒక్క సిక్స్ ఇచ్చాడు.. ఓవరాల్‌గా 7.70 ఎకానమీతో బౌలింగ్ చేసి సెలక్టర్లను, విమర్శలను తెగ ఇంప్రెస్ చేశాడు..

36

ఇప్పుడు సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా మిస్ అవుతున్నది ఇలాంటి బౌలర్లనే. సీనియర్ భువనేశ్వర్ కుమార్ రెండో టీ20లో అదరగొట్టినా... హై స్కోరింగ్ గేమ్‌ అయిన మొదటి టీ20లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు...

46
Image credit: PTI


యంగ్ బౌలర్ ఆవేశ్ ఖాన్, సీనియర్ బౌలర్ హర్షల్ పటేల్ ఆకట్టుకుంటున్నా... స్పిన్నర్లు యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్ రెండు మ్యాచుల్లో కలిపి తీసింది రెండు వికెట్లు మాత్రమే. దీంతో అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి పేసర్లు తుది జట్టులోకి వస్తే బాగుంటుందని అంటున్నారు 

56
Image credit: PTI

ఇప్పటికే తొలి రెండు మ్యాచుల్లో ఓడిన భారత జట్టు, మరో మ్యాచ్ ఓడితే టీ20 సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన రెండు మ్యాచుల్లో అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు అవకాశం ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదు...

66

అలాగే కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా తప్పుకోవడం, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్ ఫెయిల్ అవుతుండడంతో యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌ని ట్రై చేయడంలో తప్పు లేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!

Recommended Stories