మళ్లీ సోనీ చేతుల్లోకే ఐపీఎల్ ప్రసార హక్కులు...!? ఒక్కో మ్యాచ్‌కి రూ. 105 కోట్లకు పైనే...

Published : Jun 13, 2022, 12:51 PM ISTUpdated : Jun 13, 2022, 01:02 PM IST

ఐపీఎల్‌ సందడి మొదలైంది సోనీలోనే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభంలో సోనీ మ్యాక్స్‌లో ప్రసారమయ్యేది. ఆ తర్వాత స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లోకి మారింది. అయితే ఇప్పటికీ సోనీ మ్యాక్స్‌లో ఐపీఎల్‌ని ఎంజాయ్ చేసినట్టుగా స్టార్‌ స్పోర్ట్స్‌లో మ్యాచులను ఎంజాయ్ చేయలేకపోతున్నామని ఫీల్ అవుతుంటారు కొంతమంది. అలాంటి వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్...

PREV
17
మళ్లీ సోనీ చేతుల్లోకే ఐపీఎల్ ప్రసార హక్కులు...!? ఒక్కో మ్యాచ్‌కి రూ. 105 కోట్లకు పైనే...

ఐపీఎల్ 2023 సీజన్ నుంచి ఐదేళ్ల పాటు మళ్లీ సోనీలోనే ప్రసారం కానుంది... ఐపీఎల్ 2023-27 సీజన్‌కి సంబంధించిన ఐపీఎల్ మీడియా ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నట్టు సమాచారం...

27

ఐపీఎల్‌లో టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్‌కి రూ.49 కోట్లు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ, డిజిటల్ హక్కుల కోసం మరో రూ.33 కోట్లు బేస్ ప్రైజ్‌గా నిర్ణయించింది..

37

వయాకామ్,డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమేజాన్‌, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు... ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి...

47

అయితే వయాకామ్, అమేజాన్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు, ఐపీఎల్ మీడియా బిడ్డింగ్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐకి నిరాశ తప్పదేమో అనుకున్నారంతా. అయితే స్టార్ స్పోర్స్, సోనీ నెట్‌వర్క్ కలిసి బిడ్డింగ్ పెంచుతూ పోయాయట...
 

57

చివరికి ఒక్కో మ్యాచ్‌ ప్రసారానికి టీవీ రైట్స్‌కి రూ.57.5 కోట్లు, డిజిటల్ రైట్స్‌కి రూ.48 కోట్లు చెల్లించడానికి సోనీ నెట్‌వర్క్ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఒక్కో మ్యాచ్ కోసం రూ.105.5 కోట్లు బీసీసీఐకి చెల్లించనుంది సోనీ...

67

మొత్తంగా ఐదేళ్లకు కలిసి 370 మ్యాచులకు కలిపి రూ.43,255 కోట్లు.... భారత క్రికెట్ బోర్డుకి చెల్లించనుంది సోనీ నెట్‌వర్క్. మ్యాచులు పెరిగే కొద్దీ చెల్లించే మొత్తం కూడా పెరగనుంది..  విదేశాల్లో ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వచ్చే మొత్తం అదనం...

77

ఒక్కో మ్యాచ్ ద్వారా రూ.105.5 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న ఐపీఎల్, ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్‌గా రెండో స్థానంలో నిలవనుంది. ఇప్పటికే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్-ఫుట్‌బాల్)ని దాటేసిన ఐపీఎల్, అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తర్వాతి స్థానంలో నిలిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories