టీమిండియాకి మిడిల్ ఆర్డర్ ప్లేయర్ల విషయంలో సమస్య ఉందేమో కానీ ఓపెనర్ల విషయంలో డిమాండ్‌కి మించి సప్లై ఉంది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్... ఒక్క రెండు స్థానాల కోసం అరడజను మంది పోటీపడుతున్నారు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి రెండు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్ ప్లేస్‌లో మూడో టెస్టులో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం దక్కింది. మూడో టెస్టులో శుబ్‌మన్ గిల్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు...
26
Mayank Agarwal
స్వదేశంలో మయాంక్ అగర్వాల్‌కి అద్భుతమైన రికార్డు ఉంది. విదేశాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మయాంక్ అగర్వాల్, స్వదేశంలో 70కి పైగా సగటుతో టెస్టుల్లో పరుగులు చేశాడు. దీంతో మయాంక్ అగర్వాల్‌కి అవకాశం కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది...
36
వీరేంద్ర సెహ్వాల్‌లా దూకుడుగా ఆడే పృథ్వీ షా, ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత టెస్టుల్లో చోటు కోల్పోయాడు. దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడుతున్నా అతనికి టెస్టుల్లో మాత్రం తిరిగి అవకాశం ఇవ్వడం లేదు టీమిండియా...
46
KL Rahul
‘కెఎల్ రాహుల్ పక్కకు తప్పుకోగానే శుబ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. టెస్టు క్రికెట్‌లో ఈ ఇద్దరూ ఒకే సారి ఆడొచ్చు కదా. ఈ ఇద్దరూ టీమ్‌లో ఉంటే జట్టు పటిష్టంగా మారుతుంది..
56
Image credit: Getty
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయాలి. కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలి. అతనికి మిడిల్ ఆర్డర్‌లో మంచి అనుభవం ఉంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఈ స్ట్రాటెజీ, టీమిండియా విజయావకాశాలను పెంచుతుంది...
66
Shubman Gill
కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్ టూర్ 2021లో సెంచరీ చేశాడు. బాగా రాణించి వైస్ కెప్టెన్ కూడా అయ్యాడు. అందుకే అతనికి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు కల్పించడం టీమిండియాని మరింత బలంగా చేస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్..