వాళ్లు అంతే, వీళ్లు ఇంతే... సరిపోయారు ఇద్దరూనూ! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గతే ఇంతా...

Published : Mar 07, 2023, 09:56 AM IST

స్టార్ ప్లేయర్లను కొంటే ఏ టీమ్‌కి అయినా గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కథ వేరే ఉంటది. ఎంత మంది దిగ్గజ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా, విజయం మాత్రం ఆర్‌సీబీకి ఎప్పుడూ ఆమడ దూరమే... ఇప్పుడు మహిళా ఆర్‌సీబీ టీమ్‌దీ ఇదే పరిస్థితి...

PREV
18
వాళ్లు అంతే, వీళ్లు ఇంతే... సరిపోయారు ఇద్దరూనూ! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గతే ఇంతా...

క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, షేన్ వాట్సన్, కెఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్... ఇలా టీ20 స్టార్లు నిండుగా ఉన్నా, ఆర్‌సీబీ... ఐపీఎల్ టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ప్రతీ సీజన్‌కి ముందు స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయడం, భారీ అంచనాలతో సీజన్‌ని ఆరంభించడం... ఫెయిల్ అవ్వడం 16 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది...
 

28

ప్రతీ సీజన్‌కి ముందు ‘ఈసాలా కప్ నమ్‌దే’ స్లోగన్‌తో ఆర్‌సీబీ ఫ్యాన్స్ తెగ హడావుడి చేయడం, ఏవేవో సెంటిమెంట్ లెక్కలేసి ఈ సారి మా టీమ్ కప్పు కొడుతుందని బోలెడు ఆశలతో సపోర్ట్ చేయడం... తీరా సీజన్ మొదలయ్యాక బెంగళూరు టీమ్, రాయల్‌గా అదే ఫెయిల్యూర్‌ని కొనసాగించడం జరుగుతూ వస్తోంది...

38

విరాట్ కోహ్లీకి ముందు రాహుల్ ద్రావిడ్, కేవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డానియల్ విటోరి... ఆర్‌సీబీ టీమ్‌ని నడిపించారు కానీ టైటిల్ అందించలేకపోయారు. కోహ్లీ 9 సీజన్లు కష్టపడినా ఫలితం లేకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుని... ఫాఫ్ డుప్లిసిస్‌కి కెప్టెన్సీ అప్పగించాడు...

48
Image credit: PTI

ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ, ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండో క్వాలిఫైయర్ దాకా వెళ్లగలిగింది కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఆర్‌సీబీ కథ ఏ మాత్రం మారలేదు...

58

టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానని వేలంలో రూ.3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. అలాగే టీమ్‌లో ఎలీసా పెర్రీ, ఎరిన్ బర్న్స్, సోఫి డివైన్, హేథర్ నైట్, డాన్ వాన్ నెరిక్, రిచా ఘోష్, రేణుకా సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు..
 

68

టీమ్ నిండా స్టార్లు పుష్కలంగా ఉన్నా విజయాలు అందుకోవడంలో విఫలమవుతోంది ఆర్‌సీబీ. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడింది ఉమెన్స్ ఆర్‌సీబీ. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఆడిన తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుకి 222/3  పరుగుల భారీ స్కోరు అందించారు.. రాసి పెట్టినట్టుగా మహిళల ఆర్‌సీబీ టీమ్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో 223/2 పరుగులు సమర్పించారు...

78

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఆర్‌సీబీ. భారీ అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్లు, ఎప్పటిలాగే ఫెయిల్ అవుతూ బెంగళూరు జట్టును కష్టాల్లోకి నెట్టుతున్నారు. బౌలర్లు కూడా ఆర్‌సీబీ బ్రాండ్‌ తగ్గకుండా ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నారు..

88

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెతకు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్... ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సక్సెస్ సాధించడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. టీమ్‌ని పట్టిపీడిస్తున్న దరిద్రాన్ని పక్కనబెట్టి, స్మృతి మంధాన అండ్ టీమ్ ఎలా అవకాశాలను వాడుకుంటారో చూడాలి..

click me!

Recommended Stories