ఐపీఎల్ అయ్యాక టీమిండియా ఆ ఒక్క పని చేసుంటే బాగుండేది... - పీసీబీ మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

First Published Jun 9, 2023, 7:36 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో మొదటి రెండు రోజుల ఆట ముగిసే సమయానికి టీమిండియా, ఆస్ట్రేలియా కంటే రెండు అడుగులు వెనకే ఉంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో టీమిండియాపై పూర్తి డామినేషన్ చూపించింది ఆస్ట్రేలియా...
 

భారత ప్లేయర్లు రెండు నెలల పాటు ఐపీఎల్ 2023 సీజన్‌లో యమా బిజీగా టీ20 క్రికెట్‌లో మునిగి తేలి వస్తే, ఆస్ట్రేలియా ప్లేయర్లలో డేవిడ్ వార్నర్, జోష్ హజల్‌వుడ్ తప్ప మిగిలిన ప్లేయర్లు అందరూ.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం ఐపీఎల్‌‌కి దూరంగా ఉన్నారు...

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి మెంటల్‌గా, ఫిజికల్‌గా సిద్ధంగా ఉండేందుకు వీలుగా స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ అండ్ కో... ఐపీఎల్ 2023 వేలానికి పేరు కూడా రిజిస్టర్ చేయించుకోలేదు..

‘ఐపీఎల్ ఆడిన తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడడం చాలా కష్టం. అదీకాకుండా ఉపఖండ పరిస్థితుల నుంచి ఇంగ్లాండ్‌ వాతావరణానికి అలవాటు పడడానికే 5-6 రోజుల సమయం పడుతుంది..
 

అలాంటప్పుడు ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా నేరుగా ఫైనల్ ఆడడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు కనీసం ఇంట్రా స్వార్డ్ మ్యాచులు అయినా ఆడాల్సింది..

కనీసం 3-4 వన్డే మ్యాచులు ఆడినా టీ20 మూడ్ నుంచి బయటికి వచ్చేవాళ్లు. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు, ఉప ఖండ పిచ్‌లకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఆ పరిస్థితులకు అలవాటు పడడం చాలా అవసరం. బౌలర్లు ఆ లైన్, లెంగ్త్‌కి అలవాటు పడేందుకు సమయం పడుతుంది..

ఐపీఎల్‌లో నాలుగు ఓవర్లు వేసేవాళ్లు, ఇప్పుడు రోజుకి 15-20 ఓవర్లు వేయాలంటే శరీరాన్ని అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. టీమిండియాకి ఈ విషయం తెలియలేదా?’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా..

click me!