బుమ్రా, రాహుల్, అయ్యర్ ఉన్నా ఇదే జరిగేది... డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా నిజంగా మిస్ అవుతోంది అతనొక్కడినే!..

Published : Jun 09, 2023, 05:59 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023లో టీమిండియా టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఐసీసీ టోర్నీల్లో అదీ నాకౌట్ మ్యాచుల్లో టీమిండియా టాపార్డర్ ఫ్లాప్ అవ్వడం ఇప్పుడేమీ కొత్త కాదు...

PREV
18
బుమ్రా, రాహుల్, అయ్యర్ ఉన్నా ఇదే జరిగేది... డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా నిజంగా మిస్ అవుతోంది అతనొక్కడినే!..

2017 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఐసీసీ టోర్నీల్లో టీమిండియా టాపార్డర్ చేతులు ఎత్తేయడం కొనసాగుతూ వస్తోంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై, 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఈ విధంగానే ఫ్లాప్ షో కనబర్చింది టీమిండియా టాపార్డర్...
 

28

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మొదటి 2 రోజులు ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబర్చడంతో జస్ప్రిత్ బుమ్రా ఉంటే బాగుండేదనే టాక్ వినబడుతోంది.. అయితే 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన బుమ్రా, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు...

38

ఐసీసీ టోర్నీల్లో బుమ్రా ఫెయిల్యూర్ కావడం పెద్ద విశేషమేమీ కాదు. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా ఐసీసీ టోర్నీల్లో బాధ్యత తీసుకుని ఆడిన సందర్భాలు కూడా లేవు.

48
Image Credit: Getty Images

కాబట్టి జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నా... టీమిండియా పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండేవి కావు.. అయితే టీమిండియా ఎక్కువగా మిస్ అవుతోంది మాత్రం రిషబ్ పంత్‌నే. 

58

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో టీమిండియా కమ్‌బ్యాక్‌కి ప్రధాన కారణం రిషబ్ పంతే. సిడ్నీ టెస్టులో, బ్రిస్బేన్ టెస్టులో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌కి చుక్కలు చూపించాడు రిషబ్ పంత్...

68
Rishabh Pant

మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ ఆడిన రివర్స్ స్వీప్ షాట్స్‌ని వర్ణించడానికి క్రికెట్ భాషలో ఉన్న పదాలు చాలా చిన్నవైపోతాయి. టీమిండియా టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయిన ప్రతీసారీ బాధ్యత తీసుకుని ఆడడం రిషబ్ పంత్‌కి బాగా తెలిసిన మ్యాజిక్...

78

తొలి ఇన్నింగ్స్‌లో కంటే నాలుగో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ బ్యాటు నుంచి కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌లు వచ్చాయి. ఇప్పుడు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో పంత్‌లా మ్యాజిక్ చేసే ఓ బ్యాటర్, టీమిండియాకి కావాలి.. 

88

రిషబ్ పంత్‌ ప్లేస్‌లో టీమిండియాలోకి వచ్చిన శ్రీకర్ భరత్ ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేస్తే, ఈ తెలుగోడి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు, మరెన్నో అనుభవాల తర్వాత రిషబ్ పంత్ రాటుతేలినట్టుగా శ్రీకర్ భరత్‌ ఎదగాలంటే చాలా సమయం పడుతుంది.. 

Read more Photos on
click me!

Recommended Stories