ఆల్‌టైం గ్రేట్ లెజెండ్స్ లిస్టులోకి శార్దూల్... డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్‌ లకే సాధ్యమైన...

Published : Jun 09, 2023, 07:01 PM ISTUpdated : Jun 09, 2023, 07:19 PM IST

సర్ డాన్ బ్రాడ్‌మెన్, అలెన్ బోర్డర్... క్రికెట్ ప్రపంచంలో ఆల్‌టైం గ్రేట్, లెజెండరీ బ్యాటర్లు. ఈ ఇద్దరి సరసన చోటు దక్కించుకున్నాడు భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్... 30 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద చరిత్ర తిరగరాశాడు..

PREV
16
ఆల్‌టైం గ్రేట్ లెజెండ్స్ లిస్టులోకి శార్దూల్...  డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్‌ లకే సాధ్యమైన...


లార్డ్ శార్దూల్ ఠాకూర్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పర్ఫామెన్స్ ఎలా ఉన్నా, టెస్టుల్లో మాత్రం మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకుంటున్నాడు. ఆరంగ్రేటం టెస్టులో 5 బంతులే వేసి గాయపడిన శార్దూల్ ఠాకూర్, 2020-21 ఆసీస్ పర్యటనలో బ్రిస్బేన్ టెస్టులో రీఎంట్రీ ఇచ్చాడు..

26

బ్రిస్బేన్ టెస్టులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 8వ వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం జోడించాడు. ఆ మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్ ఇదే... బౌలింగ్‌లోనూ అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు..

36

శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా వంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు ఫెయిల్ అయిన చోట, అజింకా రహానేతో కలిసి ఏడో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు శార్దూల్ ఠాకూర్..

46

ఇంగ్లాండ్‌లో ఏడో వికెట్‌కి టీమిండియా తరుపున ఇది ఐదో అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 1990లో సచిన్ టెండూల్కర్- మనోజ్ ప్రభాకర్ కలిసి అజేయంగా 160 పరుగులు జోడించి టాప్‌లో ఉన్నారు. ఇదే స్టేడియంలో రిషబ్ పంత్‌తో కలిసి 2021లో 100 పరుగులు జోడించాడు శార్దూల్ ఠాకూర్...

56

2021 ఇంగ్లాండ్ పర్యటనలో ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేశాడు. తాజాగా తొలి ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, ఓవల్‌లో వరుసగా 3 సార్లు 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు..

66

1930-34 మధ్య సర్ డాన్ బ్రాడ్‌మన్, 1985-1989 మధ్య అలెన్ బోర్డర్ వరుసగా 3 ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు 50+ స్కోర్లు నమోదు చేస్తే.. 2021-2023 మధ్య శార్దూల్ ఠాకూర్ ఈ ఫీట్ సాధించి.. అరుదైన లిస్టులో చేరాడు..

click me!

Recommended Stories