పింక్ బాల్ టెస్టు ఆడేందుకు ఒప్పుకుని టీమిండియా తప్పుచేసింది... డే నైట్ టెస్టులో కచ్ఛితంగా...

First Published Dec 13, 2020, 5:45 PM IST

పింక్ బాల్ టెస్టు... ఆస్ట్రేలియా టూర్ ప్రారంభం నుంచి అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్. ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా, మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా టూర్‌లో పటిష్ట ప్రత్యర్థిని పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో ఎదుర్కోబోతోంది. అయితే ఆసీస్ పర్యటనలో పింక్ బాల్ టెస్టు ఆడేందుకు టీమిండియా అంగీకరించి ఉండకూడదని కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో సొంతం చేసుకోగా, టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో సొంతం చేసుకుంది విరాట్ సేన...
undefined
ఇరు జట్లు ఇప్పుడు పింక్ బాల్ టెస్టు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ఆసీస్, టీమిండియా మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది.
undefined
మొదట ఆస్ట్రేలియా టూర్‌లో పింక్ బాల్ టెస్టు ఆడేందుకు టీమిండియా అంగీకరించలేదు. అయితే అనేక చర్చల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, డే నైట్ టెస్టుకు ఒప్పుకున్నారు.
undefined
గత ఏడాది బంగ్లాదేశ్‌పై ఒకే ఒక్క డే నైట్ టెస్టు ఆడిన టీమిండియా, పింక్ బాల్ టెస్టుల్లో మిగిలిన జట్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఆస్ట్రేలియాను ఎలా ఎదుర్కోగలదనేది ఆసక్తికరంగా మారింది...
undefined
‘ఆడిలైడ్ టెస్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించడానికి టీమిండియాకి మంచి అవకాశం. ఆడిలైడ్ పిచ్ భారత పిచ్‌లకి దగ్గరగా ఉండడంతో టీమిండియా బౌలర్లు చక్కగా రాణిస్తారు...
undefined
అయితే ఆడిలైడ్‌లో ఆడబోయే మొదటి టెస్టు పింక్ బాల్ మ్యాచ్ కావడంతో పిచ్ ఎలా స్పందింస్తుందో భారత బౌలర్లకు తెలీదు. అక్కడ మూడు పింక్ బాల్ టెస్టులు గెలిచిన ఆసీస్‌కి చాలా క్లారిటీ ఉంటుంది...
undefined
భారత టెస్టు ప్లేయర్లు అయిన అజింకా రహానే... ఐపీఎల్ 2020లో పెద్దగా మ్యాచులు ఆడింది లేదు... మరోవైపు పూజారా, హనుమ విహారి లాంటి వాళ్లు క్రికెట్‌కి 8 నెలలుగా దూరంగా ఉన్నారు...
undefined
ఇలాంటి పరిస్థితుల్లో పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాకి చాలా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది... ఆడిలైడ్‌లో టీమిండియా ఓడితే టెస్టు సిరీస్ ఫలితాలు భిన్నంగా మారిపోతాయి...
undefined
ఆడిలైడ్‌లో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది... ఇదే వేదికపై 2014లో రెండు సెంచరీలు బాదాడు విరాట్... కానీ విజయం ఆస్ట్రేలియాకే దక్కింది...
undefined
ఎలా చూసుకున్నా ఆడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టు ఆడేందుకు టీమిండియా ఒప్పుకుని ఉండాల్సింది కాదు... మొదటి మ్యాచ్‌లోనే డే నైట్ టెస్టు కావడంతో టీమిండియా ఒత్తిడిలో ఉంటుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు ఆకాశ్ చోప్రా.
undefined
వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీలో జరిగే మూడో టెస్టు పింక్ బాల్ టెస్టు కావాల్సింది... జనవరి 7 నుంచి మొదలయ్యే ఈ మూడో టెస్టుకి విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో షెడ్యూల్‌లో మార్పు చేయాల్సి వచ్చింది.
undefined
మొదటి టెస్టు అనంతరం విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుల కింద స్వదేశం వెళుతుండడంతో మొదటి టెస్టునే డే నైట్ టెస్టుగా మార్చింది బీసీసీఐ...
undefined
click me!