హార్ధిక్ లాంటి ఇద్దరు ఆల్‌రౌండర్లు కావాలి... విరాట్ ప్రయోగాలు చేయాలి... కపిల్‌దేవ్ కామెంట్!

First Published Dec 13, 2020, 5:03 PM IST

భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ నిలకడ లేమి సమస్యతో బాధపడుతోంది. టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్ చాలామంది ఉన్నా ఓపెనర్లు విఫలమైతే, మిడిల్ ఆర్డర్‌లో భారత జట్టును ఆదుకునే సరైన బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు. దీంతో వచ్చే టీ20 వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా ప్రయోగాలు చేయాలని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్.

టీ20ల్లో మిడిల్ ఓవర్లలో భారత జట్టును ఆదుకునేందుకు సరైన బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు...
undefined
ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగిచేందుకు టీమిండియాకి మరో ఇద్దరు ముగ్గురు బ్యాట్స్‌మెన్ అవసరం....
undefined
హార్దిక్ పాండ్యా రూపంలో ఓ మంచి ఆల్‌రౌండర్ సిద్ధంగా ఉన్నాడు... అతన్ని నాలుగో స్థానంలో ఆడిస్తే మంచి ఫలితాలు వస్తాయి...
undefined
టీ20 వరల్డ్‌కప్‌ కోసం పటిష్టమైన జట్టును తయారుచేయాలంటే విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది...
undefined
మయాంక్ అగర్వాల్, సంజూ శాంసన్‌లాంటి యంగ్ ప్లేయర్లను మిడిల్ ఓవర్లలో ఆడిస్తూ ఉండాలి...
undefined
కొన్నేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా, భారత క్రికెట్ జట్టు ప్రయోగాలు చేయడంలో విఫలమవుతోంది...
undefined
ఓపెనర్లు ఎవ్వరు త్వరగా అవుట్ అయినా భారీ స్కోరు చేయలేకపోతోంది టీమిండియా. టాపార్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్‌లో ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్ ఉండాలి...
undefined
హార్ధిక్ పాండ్యాలా గేర్ మార్చి ఆడగలిగే క్రికెటర్లు మరో ఇద్దరు, ముగ్గురు ఉంటేనే ఎలాంటి టోర్నీ అయినా టీమిండియా విజయం సాధించగలదు...’ అంటూ కామెంట్ చేశాడు కపిల్ దేవ్.
undefined
ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్‌లో ముంబై తరుపున అదరగొట్టాడ. ఆ తర్వాత ఆసీస్ టూర్‌లోనూ అద్భుతంగా రాణించాడు...
undefined
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచిన హార్ధిక్ పాండ్యా, టీ20ల్లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు...
undefined
click me!