INDvAUSA: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సెంచరీల మోత... రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా డ్రా...

First Published Dec 13, 2020, 4:17 PM IST

పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచి, విజయానందంతో టెస్టు సిరీస్ ప్రారంభించాలని భావించిన టీమిండియాకు షాక్ ఇచ్చాడు ఆసీస్ ఏ జట్టు ప్లేయర్లు బెన్ మెక్‌డెర్మాట్, జాక్ విల్డర్‌ముర్త్. అద్భుత సెంచరీలతో పోరాడి, భారత జట్టుకి విజయం దక్కకుండా చేశారు.

ఓవర్ నైట్ స్కోరు 3864 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది భారత జట్టు...
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన 86 పరుగులతో కలిసి ఆస్ట్రేలియా ఏ జట్టు ముందు 472 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది...
undefined
రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా... అయితే ఆ తర్వాతే ఆసీస్ బ్యాట్స్‌మెన్ పోరాట ప్రతిమ చూపించారు.
undefined
మార్కస్ హారిస్ 16 బంతుల్లో 5 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌‌లో అవుట్ అయ్యాడు...
undefined
ఆ తర్వాత 21 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి జో బర్న్స్‌ కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు...
undefined
22 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసిన నిక్ మాడిన్‌సన్... మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో నవ్‌దీప్ సైనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
అలెక్స్ క్యారీ, బెన్ మెక్‌డెర్మాట్ కలిసి నాలుగో వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
undefined
111 బంతుల్లో 7 ఫోర్లతో 58 పరుగులు చేసిన అలెక్స్ క్యారీని హనుమ విహారి అవుట్ చేశాడు. విహారి బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు క్యారీ.
undefined
142 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఏ జట్టును బెన్ మెక్‌డెర్మాట్, జాక్ విల్డర్‌ముర్త్ కలిసి ఆదుకున్నారు.
undefined
బెన్ మెక్‌డెర్మాట్ 167 బంతుల్లో 16 ఫోర్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...
undefined
జాక్ విల్డర్‌ముత్ 119 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు...
undefined
భారత బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్, హనుమ విహారి చెరో వికెట్ తీశారు...
undefined
click me!