ఆసియా కప్‌‌లో కెఎల్ రాహుల్‌ని ఆడించడం శుద్ధ దండగ! అతని వల్ల ఏమీ మారదు... రవిశాస్త్రి కామెంట్..

Published : Aug 17, 2023, 10:30 AM IST

రెండేళ్లుగా టీమిండియాని ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఆటగాళ్ల ఫిట్‌నెస్. జస్ప్రిత్ బుమ్రా ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉంటే, రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి 9 నెలలుగా ఆటకు దూరమయ్యాడు. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ 4 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నారు..

PREV
16
ఆసియా కప్‌‌లో కెఎల్ రాహుల్‌ని ఆడించడం శుద్ధ దండగ! అతని వల్ల ఏమీ మారదు... రవిశాస్త్రి కామెంట్..

ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా, ఐర్లాండ్ టూర్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ఆగస్టు చివర్లో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీలో కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం...
 

26

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో వారి ప్లేస్‌లో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లను ఆడించింది టీమిండియా మేనేజ్‌మెంట్. అయితే వన్డేల్లో మిడిల్ ఆర్డర్‌లో ఈ ముగ్గురూ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు..

36

‘కెఎల్ రాహుల్ మోకాలి గాయం నుంచి కోలుకుని టీమ్‌లోకి వస్తున్నాడు. ఆ గాయం తీవ్రత గురించి తెలియకుండా అతన్ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఆడించడం అస్సలు కరెక్ట్ కాదు.. అది కూడా అతని రీఎంట్రీలోనే ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే, మళ్లీ గాయపడే ప్రమాదం ఉంటుంది..

46
KL Rahul

గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ప్లేయర్లకు తగినంత సమయం ఇవ్వాలి. ఫిట్‌నెస్ రిపోర్ట్ రాగానే వెంటనే టీమ్‌లోకి తెచ్చేయాలనే ఆతృత పనికి రాదు. నా ఉద్దేశంలో ఆసియా కప్‌‌లో కెఎల్ రాహుల్‌ని ఆడించడం శుద్ధ దండగ! అతని రీఎంట్రీ వల్ల ఇప్పటికిప్పుడు ఏమీ మారదు...

56

జస్ప్రిత్ బుమ్రా విషయంలో ఇదే చేశారు. అతను పూర్తిగా కోలుకోకముందే ఆడించి, 14 నెలల పాటు టీమ్‌కి దూరమయ్యేలా చేశారు. టీమిండియాకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్‌లను ఆడించండి..

66

తిలక్ వర్మ, వెస్టిండీస్ టూర్‌లో బాగా ఆడాడు. యశస్వి జైస్వాల్ కూడా ఫ్యూచర్ స్టార్‌లా కనిపిస్తున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ప్లేయర్లను ఆడించడం కంటే ఈ యంగ్ ప్లేయర్లకు ఓ అవకాశం ఇవ్వడంలో తప్పులేదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

click me!

Recommended Stories