టీమిండియా ‘బ్లాక్‌బస్టర్’ కమ్‌బ్యాక్... టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానానికి విరాట్ సేన...

First Published Feb 16, 2021, 1:09 PM IST

తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన టీమిండియా, రెండో టెస్టులో బ్లాక్ బస్టర్ పర్ఫామెన్స్‌తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌పై 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, చారిత్రక విజయం సాధించింది. టెస్టు సిరీస్‌ను సమం చేసిన టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.

రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయం అందుకున్న భారత సారథి విరాట్ కోహ్లీ, స్వదేశంలో 21టెస్టు విజయాలు అందుకుని, ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ 28 టెస్టుల్లో 21 విజయాలు అందుకోవడం విశేషం...
undefined
ఇంగ్లాండ్‌పై టీమిండియాకి ఇదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు 1986లో ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ను 279 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా, 2016లో వైజాగ్‌లో 246 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు 317 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఇంగ్లాండ్‌పై అతి పెద్ద విజయం నమోదు చేసింది.
undefined
ఓవరాల్‌గా టీమిండియాకి ఇది టెస్టుల్లో ఐదో అతిపెద్ద విజయం. ఇంతకుముందు సౌతాఫ్రికాపై 2015లో 337 పరుగుల తేడాతో, న్యూజిలాండ్‌పై 321, ఆస్ట్రేలియాపై 320, వెస్టిండీస్‌పై 318 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు....
undefined
చెన్నైలోనే జరిగిన మొదటి టెస్టులో ఇండియాలో ఇండియాపై ఇంగ్లాండ్ అతిపెద్ద విజయం అందుకోగా, రెండో టెస్టులో ఇండియా, ఇంగ్లాండ్‌పై టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం అందుకుంది...
undefined
ఈ విజయంతో 69.7 శాతం విజయాలతో టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 67 శాతం విజయాలతో ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పటికే ఫైనల్‌కి అర్హత సాధించిన న్యూజిలాండ్ 70 శాతం విజయాలతో టాప్‌లో ఉండగా ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.
undefined
ఆసియాలో వరుసగా ఐదు టెస్టు విజయాలు అందుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కి ఇది తొలి పరాజయం. అలాగే వరుసగా ఐదు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ, వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు చేసిన జో రూట్, ఆ రెండు రికార్డులను కొనసాగించలేకపోయాడు...
undefined
ఈ విజయంతో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా మహ్మద్ అజారుద్దీన్ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. స్వదేశంలో అజారుద్దీన్ 53 విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ కూడా 53వ విజయాన్ని అందుకున్నాడు. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 74 విజయాలతో టాప్‌లో ఉన్నాడు.
undefined
2013 నుంచి స్వదేశంలో టాస్ గెలిచిన మ్యాచుల్లో ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు టీమిండియా. 18 మ్యాచుల్లో 16 విజయాలు అందుకోగా, రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి...
undefined
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క ప్లేయర్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోగా, భారత బ్యాట్స్‌మెన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశారు. ఇంతకుముందు 2015లో సౌతాఫ్రికాపై మాత్రమే ఈ ఫీట్ సాధించింది టీమిండియా...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో పాటు బౌలింగ్‌లో 8 వికెట్లు తీసిన భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు...
undefined
click me!