INDvsENG: 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... విజయానికి 3 వికెట్ల దూరంలో టీమిండియా...

Published : Feb 16, 2021, 11:47 AM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఓవర్‌నైట్ స్కోరు 53/3 వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్, మొదటి సెషన్ ముగిసేసరికి వరుస విరామాల్లో మరో 4 వికెట్లు కోల్పోయింది... 

PREV
16
INDvsENG: 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... విజయానికి 3 వికెట్ల దూరంలో టీమిండియా...

53 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన డానియల్ లారెన్స్‌, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 66 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

26

ఆ తర్వాత 51 బంతుల్లో 8 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ కూడా అశ్విన్ బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ అవుట్ కావడం ఇది పదోసారి...

36

20 బంతుల్లో ఒక ఫోర్‌తో 12 పరుగులు చేసిన ఓల్లీ పోప్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇషాంత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...

46

తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన బెన్ ఫోక్స్, రెండో ఇన్నింగ్స్‌లో 9 బంతుల్లో 2 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 44 ఓవర్ల తర్వాత బౌలింగ్‌కి వచ్చిన కుల్దీప్ యాదవ్‌కి ఎట్టకేలకు లంచ్ బ్రేక్ ముందు వికెట్ దక్కింది. 

56

కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఇచ్చిన క్యాచ్‌ను మహ్మద్ సిరాజ్ జారవిడిచాడు. దీంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జో రూట్, 90 బంతుల్లో 3 ఫోర్లతో 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

66

అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా, నాలుగో ఓవర్ వేస్తున్న కుల్దీప్ యాదవ్‌కి ఓ వికెట్ దక్కింది. సిరాజ్ క్యాచ్ పట్టి ఉంటే, జో రూట్ వికెట్ కూడా కుల్దీప్ యాదవ్‌కే దక్కి ఉండేది...

click me!

Recommended Stories