INDvsENG: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం... ఇంగ్లండుపై ప్రతీకారం

Published : Feb 16, 2021, 12:38 PM ISTUpdated : Feb 16, 2021, 12:47 PM IST

తొలి టెస్టు పరాభవానికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 227 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను 317 పరుగుల భారీ తేడాతో ఓడించింది. రెండో ఇన్నింగ్స్‌లో 482 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు 164 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

PREV
18
INDvsENG: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం... ఇంగ్లండుపై ప్రతీకారం

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జో రూట్ 92 బంతుల్లో 3 ఫోర్లతో 33 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అంపైర్స్ కాల్ నిర్ణయం వల్ల ఓసారి, సిరాజ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జో రూట్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

28

డానియల్ లారెన్స్ 53 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా ఓపెనర్ రోరీ బర్న్స్ 42 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

38

17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్, ఏ దశలోనూ కోలుకున్నట్టు కనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వచ్చిన అత్యధిక భాగస్వామ్యం 38 పరుగులు మాత్రమే.. అదికూడా ఆఖరి వికెట్‌కి మొయిన్ ఆలీ సిక్సర్లు బాదడం వల్ల ఈ భాగస్వామ్యం వచ్చింది. 

48

9వ వికెట్ పడిన తర్వాత మొయిన్ ఆలీ ఓటమి తేడాను తగ్గించడానికి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన మొయిన్ ఆలీ, 18 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

58

తొలి మ్యాచ్ ఆడుతున్న అక్షర్ పటేల్ ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్‌కి మూడు వికెట్లు దక్కగా, ఐదు ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్‌కి రెండు వికెట్లు దక్కాయి.. 

68

2011లో ఆరంగ్రేటం చేసిన రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్‌గా నిలిచాడు అక్షర్ పటేల్. అశ్విన్ కంటే ముందు వీవీ కుమార్, దోషి, హిర్మాణీ, అమిత్ మిశ్రా ఈ ఫీట్ సాధించారు.

78

ఇంగ్లాండ్‌ని మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకి ఆలౌట్ చేసి 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

88

ఈ విజయంతో స్వదేశంలో 21 విజయాలు అందుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. 

click me!

Recommended Stories