విరాట్ కోహ్లీ లేకపోతేనే మనవాళ్లు బాగా ఆడతారు... సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు...

Published : Nov 21, 2020, 06:55 PM IST

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 27 నుంచి మెగా సిరీస్ మొదలుకానుంది. మొదట మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడబోతున్న భారత జట్టు, ఆ తర్వాత నాలుగు టెస్టులు ఆడనుంది. మొదటి టెస్టు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశం రానుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

PREV
17
విరాట్ కోహ్లీ లేకపోతేనే మనవాళ్లు బాగా ఆడతారు... సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు...

జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతున్న తన భార్య అనుష్క శర్మకు తోడుగా ఉండేందుకు మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం బయలుదేరి రానున్నాడు విరాట్ కోహ్లీ...

27

ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టు సిరీస్ గెలవాలంటే విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్, కెప్టెన్ అవసరం ఎంతైనా ఉంది... దీంతో కోహ్లీ స్వదేశానికి తిరిగి వస్తే భారత జట్టు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.

37

అయితే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం విరాట్ కోహ్లీ స్వదేశాగమనం గురించి భిన్నంగా స్పందించాడు... కోహ్లీ లేకపోతేనే భారత జట్టు మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తుందని కామెంట్ చేశాడు సన్నీ.

47

‘ఓసారి రికార్డులను పరిశీలిస్తే... విరాట్ కోహ్లీ ఆడని ప్రతీ మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం సాధించింది. ధర్మశాలలో ఆస్ట్రేలియాపై, ఆప్ఘనిస్థాన్‌పై టెస్టు మ్యచుతో పాటు నిదహాస్ ట్రోఫీ, 2018 ఆసియా కప్‌... ఇలా విరాట్ లేని ప్రతీ మ్యాచులో టీమిండియా గెలిచింది...

57

కోహ్లీ లేనప్పుడు అతను లేని లోటు తెలియకుండా ఉండేందుకు మిగిలిన ఆటగాళ్లు మరింత కసిగా ఆడతారు... అందుకే కోహ్లీ లేని మ్యాచుల్లో భారత జట్టు మరింత మెరుగ్గా రాణిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్.

67

విరాట్ కోహ్లీ గైర్హజరీతో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన అజింక్యా రహానే, ఛతేశ్వర్ పూజారాలపై భారం పడుతుందని చెప్పిన సునీల్ గవాస్కర్, కెప్టెన్సీ బాధ్యతలు రహానే మరింత మెరుగ్గా రాణించేందుకు సహాయపడతాయని అన్నాడు.

77

గత పర్యటనలో అద్భుతంగా రాణించిన ఛతేశ్వర్ పూజారాపై ఒత్తిడి ఉంటుందని చెప్పిన సునీల్ గవాస్కర్... అతనికి ఎవ్వరూ సలహాలు, సూచనలు ఇవ్వకూడదని చెప్పాడు. 

click me!

Recommended Stories