IPL: నువ్వు ఎంతకు అమ్ముడుపోయావు..? లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్ వుడ్ భార్య షాకింగ్ కామెంట్స్

Published : Feb 20, 2022, 02:50 PM IST

IPL2022 Auction: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో ఇంగ్లీస్ పేసర్ అయిన మార్క్ వుడ్ ను లక్నో సూపర్ జెయింట్స్  భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో అతడి భార్య సారా వుడ్ పై.. 

PREV
17
IPL: నువ్వు ఎంతకు అమ్ముడుపోయావు..? లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్  మార్క్ వుడ్ భార్య షాకింగ్ కామెంట్స్

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ను  లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) భారీ ధర వెచ్చించి దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో  వేలంలోకి వచ్చిన వుడ్ కోసం ఎల్ఎస్జీ.. రూ. 7.50 కోట్లకు దక్కించుకుంది. 

27

మార్క్ వుడ్ కోసం వేలంలో ముందు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. కొద్దిసేపటి తర్వాత అతడిని దక్కించుకోవడానికి ముంబై ఇండియన్స్ కూడా పోటీలోకి వచ్చింది. 

37

నాలుగు జట్లు (లక్నో, ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ, గుజరాత్)  వుడ్ కోసం పోటీ పడినా చివరికి లక్నో జట్టు అతడికి రూ. 7.5 కోట్లతో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

47

ఐపీఎల్ వేలాన్ని  తాను తన కుటుంబంతో కలిసి వీక్షించానని,  ఆక్షన్ లో తన పేరు వచ్చినప్పుడు అందరూ  ఒకింత టెన్షన్ కు గురయ్యామని వుడ్ వివరించాడు.

57

ఇదే విషయమై వుడ్ మాట్లాడుతూ.. ‘వేలం జరుగుతున్నప్పుడు నా భార్య సారా నాతో పాటే ఉంది.  నా పేరిట వేలం ముగిశాక నా భార్య నాతో.. అది (రూ. 7.5 కోట్లు) పౌండ్లలో బదిలీ చేస్తే ఎంతవుతుంది..? అని అడిగింది..’ అని అన్నాడు.

67

ఇంకా వుడ్ స్పందిస్తూ.. ‘మొత్తానికి వేలం నాకు  కొత్త అనుభూతినిచ్చింది. అది జరుగుతున్నంత సేపు  నాకు ఒక కంప్యూటర్ గేమ్ లా అనిపించింది. అదంతా ఒక కలలా అనిపించింది.  కానీ ఒప్పందం పూర్తయిన తర్వాత అది వాస్తవ రూపం దాల్చుతుంది..’ అని చెప్పుకొచ్చాడు.   

77

‘ఐపీఎల్ వేలం మొదటి రోజు మా పెళ్లి రోజు. ఆ రోజు మేం బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ అదే సమయానికి వేలం నిర్వహిస్తున్న హ్యూజ్ ఎడ్మీడెస్ అస్వస్థతకు గురై కళ్లుతిరిగి కింద పడిపోవడంతో మేం షాక్ కు గురయ్యాం. దీంతో  మేమంతా షాక్ కు గురయ్యాం..’ అని చెప్పుకొచ్చాడు. 
 

click me!

Recommended Stories