అశ్విన్‌‌ను ఆడించాల్సిన అవసరం లేదు... వికెట్ తీయకపోయినా రవీంద్ర జడేజాతోనే...

First Published Aug 19, 2021, 2:25 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా... అందరూ కలిసి కట్టుగా రాణిస్తూ భారత జట్టుకి అవసరమైన వికెట్లు అందిస్తున్నారు... దీంతో రవిచంద్రన్ అశ్విన్‌తో అవసరం లేదంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

మొదటి రెండు టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించినా... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పటికే నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 400+ పరుగులు చేశాడు జో రూట్...

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ ఒక్కడే 180 పరుగులతో అజేయంగా నిలిస్తే, మిగిలిన జట్టులో బెయిర్ స్టో మినహా ఏ ప్లేయర్ కూడా హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయారు...

జో రూట్‌ వికెట్ త్వరగా తీసి ఉంటే... భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ ఆధిక్యం దక్కి ఉండేది. జో రూట్ రాణించిన ప్రతిసారీ రవిచంద్రన్ అశ్విన్‌ను మిస్ అయ్యింది టీమిండియా... అశ్విన్ ఉండి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి...

జో రూట్‌ను అడ్డుకునేందుకు మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ బరిలో దిగబోతున్నాడని ప్రచారం నడిచింది. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో అతని స్థానంలో అశ్విన్ ఆడబోతున్నాడని టాక్ వినిపించింది...

అయితే మూడో టెస్టులో అశ్విన్‌ను ఆడించాల్సిన అవసరం లేదంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా... ‘లార్డ్స్‌లో అశ్విన్‌ను ఆడించి ఉంటే బాగుండేది. ఎందుకంటే అక్కడ పిచ్ అప్పటికే ఉపయోగించినదీ, డ్రై కావడంతో స్పిన్నర్లకు చక్కగా అనుకూలించేది..

లీడ్స్ టెస్టులో అశ్విన్‌ అవసరం లేదు. ఇక్కడి పిచ్, స్పిన్నర్లకు అనుకూలించదు. అదీకాకుండా ఇప్పటికే భారత ఫాస్ట్ బౌలర్లు, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో భయం పుట్టించగలిగారు...

అశ్విన్‌ని ఆడించాలంటే జడేజాని పక్కనబెట్టాలి. జడేజా రెండు మ్యాచుల్లో వికెట్లేమీ తీయలేకపోయాడు. కానీ అతను బౌలింగ్‌లో విఫలం కావడం జట్టుకి ఎలాంటి నష్టాన్ని చేకూర్చలేదు...

అదీకాకుండా బ్యాటింగ్‌లో అమూల్యమైన పరుగులు చేశాడు. ఇప్పుడు జడేజా అవసరం జట్టుకి ఉంది. అశ్విన్, జడేజాలను ఆడించాలంటే... నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆడే అవకాశం ఉండదు...

కాబట్టి ఇప్పటికైతే అశ్విన్ అవసరం జట్టుకి లేదనే నేను అనుకుంటున్నా...  విజయాలు సాధిస్తున్న జట్టులో మార్పులు చేయకపోవడమే మంచిది... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా... 

click me!