ఐపీఎల్ 2021: అప్పుడు రానన్నారు, ఇప్పుడు దాని కోసం ఎగబడుతున్నారు... టీ20 వరల్డ్‌కప్‌తో...

First Published Aug 19, 2021, 10:14 AM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 సీజన్‌కి ప్రిపరేషన్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఆగస్టు 20న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ వంటి జట్లు, యూఏఈలో క్యాంపు మొదలెట్టబోతున్నాయి. కరోనా కారణంగా ఆగిన మొదటి ఫేజ్‌తో పోలిస్తే... ఈసారి ఐపీఎల్‌లో విదేశీ స్టార్లు ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తోంది...

కరోనా కారణంగా ఇండియాలో జరిగిన ఐపీఎల్ ఫేజ్ 1కి రానని తేల్చి చెప్పేసిన ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజల్‌వుడ్, సెకండ్ ఫేజ్‌లో మాత్రం పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట...

దీనికి కారణం యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ముగిసిన తర్వాత అక్కడే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరగనుంది. టీ20 వరల్డ్‌కప్ ముందు జరిగే ఐపీఎల్ ఆడితే, ప్రాక్టీస్ దొరికినట్టు అవుతుంది, మిగిలిన దేశాల వీక్‌నెస్‌లు తెలుసుకోవడానికి వీలుంటుంది...

అందుకే జోష్ హజల్‌వుడ్‌తో పాటు గాయం కారణంగా ఫేజ్ 2లో ఆడడానికి ఇష్టపడని స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్‌ 2021 సీజన్ ఆడతానని ప్రకటించారు... వీరితో పాటు అప్పుడు మధ్యలోనే పెట్టేబేడా సర్దుకుని పారిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై... ఐపీఎల్‌లో ఆడేందుకు ఇష్టపడుతున్నారు...

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, ఫేజ్ 2లో ఆడేందుకు ఇష్టపడకపోవచ్చని భావించిన ఆర్‌సీబీ, అతని స్థానంలో శ్రీలంక స్పిన్నర్ హసరంగను ఆడించేందుకు ప్రయత్నాలు చేసింది...

అయితే ఇప్పుడు జంపా రీఎంట్రీ కన్ఫార్మ్ కావడంతో హసరంగను ఆడించే అవకాశం ఉండదు. అలాగే జోష్ హజల్‌‌‌వుడ్ స్థానంలో హసరంగను తీసుకోవాలని సీఎస్‌కే ప్రయత్నించింది. ఇప్పుడు హజల్‌వుడ్ కూడా వస్తుండడంతో చెన్నైకి కూడా ఛాన్స్ లేకుండా పోయింది...

ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా ఐపీఎల్ 2021 ఫేజ్‌2లో పాల్గొనేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నామని ప్రకటించారు. వీళ్లకి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ఇంత ప్రేమ, అభిమానం పుట్టుకురావడానికి కారణం టీ20 వరల్డ్‌కప్ టోర్నీయే...

న్యూజిలాండ్ క్రికెటర్లు కేన్ విలియంసన్, ట్రెంట్ బౌల్ట్, కేల్ జెమ్మీసన్‌లతో పాటు బంగ్లాదేశ్ క్రికెటర్లు షకీబ్ వుల్ హక్, ముస్తఫీజుర్ రెహ్మాన్ కూడా ఐపీఎల్ ఆడబోతున్నారు. కరోనా కారణంగా ఐపీఎల్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడిన తర్వాత, ఫేజ్ 2కి తమ ప్లేయర్లను పంపలేమని, బిజీ షెడ్యూల్‌లో గడపబోతున్నారని కామెంట్ చేశాడు బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు...

అయితే ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ, యూఏఈలోకి మారడం... ఈ టోర్నీ ఆరంభానికి ముందే ఐపీఎల్ 2021 సీజన్ జరుగుతుండడంతో బంగ్లా క్రికెటర్లు కూడా ఎలాగైనా ఫేజ్ 2లో ఆడాలని డిసైడ్ అయిపోయారు...

ఎలా చూసుకున్నా ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో కంటే, ఫేజ్ 2లో పాల్గొనే ఫారిన్ ప్లేయర్లు ఎక్కువగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క ప్యాట్ కమ్మిన్స్ మినహా మిగిలిన అందరూ యూఏఈ వేదికగా జరిగే సీజన్ 14లో ఆడబోతున్నారు..

click me!