రాహులో రాహులా... ఏందీ ఓవయాక్షన్... మొదటి వన్డేలో తేలిపోయిన కెఎల్ రాహుల్...

First Published | Nov 28, 2020, 4:10 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నన్నిరోజులు టీమిండియాకి మరో వికెట్ కీపర్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా, వికెట్ల వెనకాల కళ్లు చెదిరే క్యాచులు అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేశాడు ధోనీ. మాహీ వారసుడిగా రిషబ్ పంత్‌కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిల్ అవుతూ వచ్చాడు. తాజాగా బ్యాటుతో రాణిస్తున్న కెఎల్ రాహుల్, వికెట్ కీపర్‌గానూ తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే మొదటి వన్డేలో వికెట్ కీపర్‌గా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు కెఎల్ రాహుల్.

ఆస్ట్రేలియాలో వన్డే, టీ20 సిరీస్‌లకు వైస్ కెప్టెన్‌గా కూడా అదనపు బాధ్యతలు తీసుకున్నాడు కెఎల్ రాహుల్... అయితే తనపై మోపిన ఈ బాధ్యత కెఎల్ రాహుల్‌ని ఒత్తిడిలోకి నెట్టేసినట్టు కనిపించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో వికెట్ల వెనకాల అత్యుత్యాహం కనబరిచాడు కెఎల్ రాహుల్. బ్యాటును మిస్ అయిన ప్రతీ బంతికి అప్పీలు చేస్తున్నట్టుగా కెఎల్ రాహుల్ చేసిన ఓవర్ యాక్షన్ చూసి, క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురి అయ్యారు.

మహేంద్ర సింగ్ ధోనీకి కరెక్ట్ రిప్లేస్‌మెంట్ తానేనని నిరూపించుకోవాలనే తాపత్రయం కెఎల్ రాహుల్‌లో స్పష్టంగా కనిపించింది. మొదటి వన్డేకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కెఎల్ రాహుల్.
‘మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అయితే ధోనీ పాత్రలో ఒదిగిపోయేందుకు నేను ప్రయత్నిస్తా...’ అంటూ చెప్పుకొచ్చాడు కెఎల్ రాహుల్. అయితే ధోనీలా మారాలని కెఎల్ రాహుల్ ఇచ్చిన సలహాలను బౌలర్లు పట్టించుకోలేదు.
ఫించ్ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తాడని హిందీలో బౌలర్ యజ్వేంద్ర చాహాల్‌కి చెప్పాడు కెఎల్ రాహుల్. అయితే అతని మాటను పట్టించుకోని చాహాల్, ప్లైటెడ్ బాల్ వేశాడు. అదే బంతికి ఫించ్ సిక్సర్ బాదాడు.
‘టీమిండియా తరుపున వికెట్ కీపింగ్ చేయడం నాకెప్పుడూ ఇష్టం. వికెట్ల వెనకాల గ్లవ్స్ పెట్టుకుని కీపింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తుంటా... న్యూజిలాండ్ పర్యటనలో వికెట్ కీపింగ్ బాగా ఎంజాయ్ చేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు కెఎల్ రాహుల్.
ఐపీఎల్‌లో 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న కెఎల్ రాహుల్... ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో 15 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
వికెట్ కీపింగ్‌లో అద్భుతంగా ప్రదర్శన ఇవ్వకపోయినా డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టోయినిస్ క్యాచులు అందుకుని పర్వాలేదనిపించాడు....
రిషబ్ పంత్ ఫెయిల్ అవుతుండడంతో సంజూ శాంసన్ నిరూపించుకునేదాకా కెఎల్ రాహుల్‌ ప్లేస్‌కి ఢోకా లేనట్టే.
అదీకాకుండా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఘోరంగా విఫలమైన మ్యాక్స్‌వెల్ భారీ షాట్లు కొడుతుండడంతో కూసింత షాక్‌కి గురయ్యాడు కెఎల్ రాహుల్. రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ మూడ్ నుంచి కెఎల్ రాహుల్ ఇంకా బయటికి రాన్నట్టు కనిపించింది.

Latest Videos

click me!