తండ్రిని అయ్యాక నాలో మార్పు వచ్చింది... అవసరమైనప్పుడు అది చేస్తాను... హార్ధిక్ పాండ్యా!

First Published Nov 28, 2020, 3:15 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఫెయిల్ అయిన టీమిండియాకు సంతోషాన్నిచ్చే ఒకే ఒక్క విషయం ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇన్నింగ్స్... ఐపీఎల్‌లో మెరిసిన హార్ధిక్ పాండ్యా, అదే జోరును మొదటి వన్డేలోనూ చూపించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసుకున్నాడు.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా. ఇంతకుముందు ఈ రికార్డు ధోనీ పేరిట ఉంది...
undefined
శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా కలిసి 37 మ్యాచులు ఆడినా ఒక్కసారి కూడా వీరిద్దరి మధ్య భాగస్వామ్యం నమోదుకాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేల్లో ఐదో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పాడు హార్ధిక్ పాండ్యా.
undefined
ఐదో వికెట్‌కి 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హార్ధిక్ పాండ్యా 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు...
undefined
వెన్నెముక గాయం తర్వాత పెద్దగా క్రికెట్ ఆడని హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్ తర్వాత మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే మంచి ఇన్నింగ్స్‌తో తన సత్తా ఏంటో చూపించాడు.
undefined
‘తండ్రిని అయ్యాక నాలో చాలా మార్పు వచ్చినట్టుంది. ఓ వ్యక్తిగా నేను చాలా మారాను. చాలా కామ్‌గా ఆడుతున్నా. నా కొడుకు అగస్త్య పుట్టాక 15 రోజులకే ఐపీఎల్ కోసం యూఏఈకి వచ్చేశా... ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్...
undefined
ఇప్పుడు నా కొడుకుకి 4 నెలలు... నేను ఇంటికి వెళ్లేసరికి చాలా మారిపోతాడు. అయితే నా జీవితంలో ఇది బెస్ట్ టైమ్...
undefined
బౌలింగ్ చేయాలని నాక్కూడా ఉంది. అయితే వెన్నెముక ఆపరేషన్ తర్వాత నాలో ఇంకా బౌలింగ్ చేయగలననే నమ్మకం రాలేదు... నమ్మకం వచ్చాక బంతిని అందుకుంటా...
undefined
నేను బౌలింగ్ వేస్తే నూటికి నూరు శాతం రిజల్ట్ ఉండాలని కోరుకుంటా... అందుకే జట్టుకి అవసరమైన బౌలింగ్ చేయడానికి రెఢీ అవుతున్నా... టీ20 ప్రపంచకప్ సమయానికి బౌలింగ్ చేయొచ్చు...’ అని చెప్పుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా.
undefined
భారీ టార్గెట్‌ను చేజ్ చేస్తున్నప్పుడు ప్రతీ ఆటగాడు కసిగా ఆడాల్సి ఉంటుందని చెప్పిన హార్ధిక్ పాండ్యా.. ఐదుగురు బౌలర్లతో ఆడితే విజయాలు సాధించడం కష్టమేనని అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
undefined
జట్టుకి ఇంకో ఆల్‌రౌండర్ అవసరం ఉందని చెప్పిన హార్ధిక్ పాండ్యా, అందుకోసం ‘పాండ్యా కుటుంబాన్నే’ సంప్రదించాల్సి ఉంటుందేమోనని అన్నాడు. హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా కూడా ఆల్‌రౌండర్‌ అని అందరికీ తెలిసిన విషయమే.
undefined
click me!