బ్యాటింగ్ రాని బౌలర్లతో వరల్డ్ కప్ గెలవలేం... వసీం జాఫర్ కామెంట్...

First Published Jan 12, 2023, 9:56 AM IST

ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా విజయాలకు ప్రధాన కారణం ఆల్‌రౌండర్లే. కేవలం బ్యాటింగ్, బౌలింగ్ స్పెషలిస్టులపై ఆధారపడకుండా ఎక్కువ మంది ఆల్‌రౌండర్లను ఆడించడానికి ప్రాధాన్యం ఇస్తాయి ఈ రెండు జట్లు... టీమిండియా పరిస్థితి మాత్రం వేరు...
 

Mohammed Shami

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ నుంచి టీమిండియా ఓ స్పిన్ ఆల్‌రౌండర్, ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫార్ములానే అనుసరిస్తోంది. మిగిలిన ప్లేయర్లు ఉంటే బ్యాటర్లుగా లేదంటే బౌలర్లుగానే ఉంటారు...

వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు. అయితే ఈ ఇద్దరినీ ఒకే మ్యాచ్‌లో ఆడించేందుకు టీమిండియా సాహసించడం లేదు...

Image credit: PTI

అలాగే హార్ధిక్ పాండ్యా గాయపడితే మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కనిపించడం లేదు. వెంకటేశ్ అయ్యర్ ఆశాకిరణంలా కనిపించినా పాండ్యాకి పోటీ అవుతాడనే ఉద్దేశంతో అతన్ని సరిగ్గా వాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు టీమిండియా..

Image credit: PTI

‘తరాలు మారుతున్నా టీమిండియా పద్ధతి మాత్రం మారడం లేదు. మహ్మద్ షమీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. తొలి వన్డేలో టీమిండియా 370 పరుగులు చేసినా ఆఖరి 3 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే వచ్చాయి...

మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌ బ్యాటింగ్ చేయలేరు. తొలుత బ్యాటింగ్ చేశాం కాబట్టి సరిపోయింది, అదే లక్ష్యఛేదనలో ఇలాంటి పరిస్థితి వస్తే... చివర్లో ఓవర్‌కి 8-10 కావాల్సి వచ్చినా చేయగల బౌలర్లు ఉండాలి...

Image credit: PTI

టీమిండియాలో ఉన్న మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహాల్ కేవలం బౌలర్లు మాత్రమే. వారి బ్యాటింగ్ నైపుణ్యం ఏంటో అందరికీ తెలుసు. టీమిండియా ఆల్‌రౌండర్లపై ఫోకస్ పెడితే బెటర్...

Image credit: Getty

శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు తుది జట్టులో ఉంటే చివర్లో అవసరమైతే బ్యాటుతో కూడా రాణించగలరు. హార్ధిక్ పాండ్యా ఒక్కడి మీద ఆధారపడడం ఏ మాత్రం కరెక్ట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..  

click me!