సంజూ ఏం చేయగలడో తెలిసిందా? టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, శాంసన్‌ని మిస్ అవుతుందా...

Published : Oct 07, 2022, 10:04 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్. ఐపీఎల్‌లో శాంసన్ ఆడిన విధానం, అతని యాటిట్యూడ్ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఫుల్లుగా నచ్చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో మొదటి వన్డేలో సంజూ శాంసన్ ఆడిన విధానంతో సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

PREV
16
సంజూ ఏం చేయగలడో తెలిసిందా? టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, శాంసన్‌ని మిస్ అవుతుందా...
Sanju Samson

టాపార్డర్‌లో శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్యూర్‌తో విజయంపై ఆశలు కోల్పోయింది భారత జట్టు. అయితే ఆఖర్లో శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్ సూపర్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు...

26
Image credit: PTI

శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ అవుట్ అయినా సంజూ శాంసన్ ఆఖరి వరకూ అద్భుత పోరాటం చూపించాడు. 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసిన సంజూ శాంసన్, దాదాపు మ్యాచ్‌ని గెలిపించినంత పని చేశాడు...

36
Sanju Samson

ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు కావాల్సిన సమయంలోనూ సంజూ శాంసన్‌లో కనిపించిన కాన్ఫిడెన్స్, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యాన్ని కలిగించింది.మరో రెండు బాల్స్ ఆడి ఉంటే మ్యాచ్ రిజల్ట్‌ని మార్చేసేవాడినని ధీమాగా చెప్పాడు సంజూ శాంసన్...

46
sanju samson

టాపార్డర్ జిడ్డు బ్యాటింగ్ కారణంగా భారత ఇన్నింగ్స్‌లో నాలుగు మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. ఆ ఓవర్లలో ఒక్క ఓవర్ సంజూ శాంసన్ ఆడినా రిజల్ట్ మారిపోయి ఉండేదది. సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ లేకుంటే టీమిండియా కచ్ఛితంగా 30-40 పరుగుల తేడాతో ఓడి ఉండేది.

56
Sanju Samson

దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వాల్సిందేననే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ‘#SanjuSamsonforT20WC’ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అక్టోబర్ 15 వరకూ తుదిజట్టును ప్రకటించేందుకు సమయం ఉండడంతో ఇప్పటికైనా సెలక్టర్లు కళ్లు తెరిచి, శాంసన్‌ని ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కించాలని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...

66
sanju samson

అయితే ఇప్పటికే రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లను ఆస్ట్రేలియా పంపించిన టీమిండియా మేనేజ్‌మెంట్, సంజూ శాంసన్‌ని టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయడం అనుమానమే అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

click me!

Recommended Stories