కోహ్లీ కెప్టెన్సీతో పాటే నెం.1 ర్యాంకు కూడా పాయే... 60 ఏళ్లలో లేనిది, కెఎల్ రాహుల్ తీసుకొచ్చాడు...

First Published Jan 24, 2022, 11:35 AM IST

భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతుందో తెలీదు కానీ, ఆ ప్రభావం మాత్రం టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా పడింది. విరాట్ కోహ్లీని వన్డే సారథిగా తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది...

గత పర్యటనలో టెస్టు సిరీస్ కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపించింది టీమిండియా... ఆరు వన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో గెలిచింది. ఆ ఓడిన వన్డే కూడా వర్షం కారణంగా లక్కీగా సఫారీ జట్టుకి దక్కిన విజయమే...

సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీని అర్ధాంతరంగా వన్డే కెప్టెన్సీ నుంచి తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

దీంతో యంగ్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది భారత జట్టు...

2006లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాలో నాలుగు వన్డేల సిరీస్ ఆడింది భారత జట్టు. ఈ సిరీస్‌లో మొదటి వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయ్యింది...

ఆ తర్వాత మూడు వన్డేల్లో భారత జట్టు ఓడింది. అయితే ఓ వన్డే రద్దు కావడంతో అది వైట్‌వాష్ కాదు. దీంతో సౌతాఫ్రికాలో వన్డే సరీస్‌లో భారత జట్టును వైట్‌వాష్ చేసిన చెత్త రికార్డు కెఎల్ రాహుల్‌ ఖాతాలో చేరింది...

కెప్టెన్‌గా మొదటి టెస్టుతో పాటు వరుసగా మూడు వన్డేల్లో ఓడిన కెఎల్ రాహుల్... గత 60 ఏళ్లల్లో మొదటి నాలుగు మ్యాచుల్లో విజయం అందుకోలేకపోయిన భారత కెప్టెన్‌గా దారుణమైన రికార్డు సొంతం చేసుకున్నాడు...

ముంబై టెస్టు, ఆ తర్వాత సెంచూరియన్ టెస్టు విజయంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా నెం.1 ర్యాంకును అందుకుంటే... జోహన్‌బర్గ్ టెస్టు, కేప్ టౌన్ టెస్టు పరాజయాలతో భారత టెస్టు ర్యాంకు దిగజారింది...

ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ విజయంతో టెస్టుల్లో టాప్ ర్యాంకుకి దూసుకెళ్లగా, వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన భారత జట్టు... మూడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది.  

click me!