వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా... భారమంతా ఆ ఇద్దరిపైనే...

First Published Jun 20, 2021, 5:01 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవర్‌నైట్ స్కోరు 146/3 వద్ద ఆటను ప్రారంభించిన భారత జట్టును న్యూజిలాండ్ బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు....

వర్షం కారణంగా అరగంట ఆలస్యమైంది ఆట. పిచ్‌పై ఉన్న తేమను సరిగ్గా వినియోగించుకున్న న్యూజిలాండ్ బౌలర్లు, భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు.త
undefined
ఓవర్‌నైట్ స్కోరుకి ఒక్క పరుగు కూడా జత చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, 132 బంతుల్లో ఓ ఫోర్‌తో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... దీంతో 149 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు...
undefined
కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. వెంటనే రివ్యూకి వెళ్లినా ఫలితం లేకపోయింది...
undefined
ఆ తర్వాత భారీ అంచనాలతో బరిలో దిగిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, 22 బంతులాడి ఓ ఫోర్‌ బాది అవుట్ అయ్యాడు... 156 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా...
undefined
ఓ వైపు వికెట్లు పడుతున్నా చక్కగా బ్యాటింగ్ చేసిన వైస్ కెప్టెన్ అజింకా రహానే 117 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రహానే...
undefined
భారత జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ ఇప్పటికే పెవిలియన్ చేరడంతో ఇక బ్యాటింగ్ భారమంతా క్రీజులో ఉన్న ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లపైనే పడింది...
undefined
న్యూజిలాండ్ బౌలర్లలో కేల్ జెమ్మీసన్ మూడు వికెట్లు తీయగా, నీల్ వాగ్నర్ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్‌కి ఓ వికెట్ దక్కింది...
undefined
click me!