సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌‌లతో పాటే విరాట్ కోహ్లీ కూడా... ‘కింగ్’ ఎంట్రీకి 10 ఏళ్లు...

First Published Jun 20, 2021, 4:21 PM IST

భారత క్రికెట్ చరిత్రలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. క్రికెట్ చరిత్రలో సూపర్ స్టార్లుగా, లెజెండరీ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముగ్గురూ ఒకే రోజు టెస్టు ఎంట్రీ ఇవ్వడం విశేషం...

జూన్ 20, 1996లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు సౌరవ్ గంగూలీ. టీమిండియా దశను మార్చిన ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న దాదా... తన తొలి టెస్టులో సెంచరీ చేసిన సౌరవ్ గంగూలీ, లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఆరంగ్రేటం టెస్టు ఆడుతూ సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
undefined
గంగూలీ ఎంట్రీ మ్యాచ్‌లోనే రాహుల్ ద్రావిడ్ కూడా ఆరంగ్రేటం చేశాడు. తొలి మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ద్రావిడ్, గంగూలీతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి మ్యాచ్‌లోనే 95 పరుగులు చేసిన ద్రావిడ్, ఐదు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...
undefined
గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలు, టెస్టు ఆరంగ్రేటం చేసిన రోజునే 15 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ... 2011, జూన్ 20న వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
2008లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, సీనియర్ల కారణంగా టెస్టు ఎంట్రీ కోసం మూడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2011 విండీస్ టూర్‌లో గంభీర్, సెహ్వాగ్ గాయాల కారణంగా దూరం కావడంతో వారి స్థానంలో టెస్టుల్లో చోటు దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ...
undefined
తొలి టెస్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... తొలి టెస్టు సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ, కేవం 76 పరుగులే చేయగలిగాడు.
undefined
అయితే నవంబర్‌లో విండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్న కోహ్లీ, తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు, ఆసీస్ టూర్‌లో సెంచరీ చేసి టెస్టుల్లో ప్లేస్ పర్మినెంట్ చేసుకున్నాడు.
undefined
ఆ తర్వాత 2014లో ధోనీ నుంచి టెస్టు పగ్గాలు తీసుకున్న విరాట్ కోహ్లీ... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న టీమిండియాను వరుస విజయాలతో టాప్‌కి చేర్చాడు... కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా ఐదేళ్లు టెస్టుల్లో టాప్‌లో నిలిచింది టీమిండియా...
undefined
జూన్ 20న టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ, తన కెరీర్‌లో 113 టెస్టుల్లో 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 32 వికెట్లు పడగొట్టాడు...
undefined
ఇదే రోజున ఆరంగ్రేటం చేసిన రాహుల్ ద్రావిడ్ 164 టెస్టుల్లో 13,288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
undefined
టీమిండియా తరుపున జూన్ 20న ఎంట్రీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ.. ముగ్గురూ కూడా ప్లేయర్లగానే కాకుండా కెప్టెన్‌గానూ తమదైన ముద్ర వేశారు.
undefined
click me!