టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హిట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు.. ఫిట్నెస్ క్లీయర్.. కానీ..?

Published : Dec 26, 2021, 12:12 PM IST

Rohit sharma: టీమిండియా అభిమానులకు శుభవార్త.. భారత జట్టు పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించాడు. గాయం నుంచి అతడు కోలుకున్నట్టు ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. 

PREV
111
టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హిట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు.. ఫిట్నెస్ క్లీయర్.. కానీ..?

దక్షిణాఫ్రికాతో భారత జట్టు తొలి టెస్టుకు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త. గాయంతో టెస్టు సిరీస్ నుంచి దూరమైన టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ త్వరలోనే  జట్టుతో కలువనున్నాడు. 

211

టెస్టు సిరీస్ కు ముందు ముంబైలో ప్రాక్టీస్ చేస్తుండగా.. రోహిత్ చేతికి బంతి బలంగా తాకడంతో అతడు గాయపడ్డాడు. దీంతో అతడు  కీలక పర్యటన నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 

311

కాగా.. గాయం తర్వాత ఇన్నాళ్లు రీహాబిటేషన్ నిమిత్తం రోహిత్ శర్మ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉన్నాడు. ఎన్సీఏ వర్గాల సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడని సమాచారం. 

411

ఈ మేరకు నిర్వహించిన ప్రిలిమినరీ ఫిట్నెస్ పరీక్ష లో  హిట్ మ్యాన్ పాసయ్యాడు. అయితే అతడు తన ఫిట్నెస్ ను నిరూపించుుకోవడానికి మరో పరీక్ష పాస్ కావాల్సి ఉంది. ఇది క్లీయర్ చేస్తేనే అతడికి గ్రీన్ సిగ్నల్ దక్కుతుంది. 

511

సోమవారం నాడు హిట్ మ్యాన్ మరోసారి ఫిట్నెస్ పరీక్షలకు హాజరుకానున్నాడు. అయితే రోహిత్.. ఫిట్ గా ఉన్నాడని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. 

611

ఎన్సీఏ కు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ..‘రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు తన గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. ప్రిలిమినరీ పరీక్షలో హిట్ మ్యాన్ ఉత్తీర్ణత సాధించాడు. 

711

అతడు ఇంకా ఎన్సీఏలోనే ఉన్నాడు. రోహిత్  కు సోమవారం మరోసారి ఫిట్నెస్ నిర్వహించాల్సి ఉంది. ఆ పరీక్ష లోని ఫలితాల ఆధారంగా మేం తుది నిర్ణయం తీసుకుంటాం..’ అని  అతడు తెలిపాడు. 
 

811

ఇక రోహిత్ తో పాటు గాయంతో ఇబ్బందిపడుతూ ఎన్సీఏలోనే ఉన్న టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లు ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. 

911

‘వాళ్లింకా పూర్తి ఫిట్నస్ సాధించలేదు. దక్షిణాఫ్రికాతో వన్డే జట్టుకు వారిని ఎంపిక చేస్తారా..? లేదా..? అనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం.. సౌతాఫ్రికాలో స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేరు...’ అని అన్నాడు. 
 

1011

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు మరో రెండు మూడు రోజుల్లో జట్టును ప్రకటించనున్నారు.  అయితే  దేశవాళీ ట్రోఫీలలో అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్ ల వంటి యువ ఆటగాళ్లకు ఈసారి స్థానం దక్కవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. 

1111

వీరితో పాటు ఇషాన్ కిషన్, పృథ్వీ షా లు కూడా స్థానం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇక టీమిండియా సీనియర్  క్రికెటర్ శిఖర్ ధావన్  భవితవ్యం కూడా ఈ సిరీస్ తో తేలిపోనున్నది.  

Read more Photos on
click me!

Recommended Stories