క్రికెటర్‌గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో, క్రికెట్‌కి వీడ్కోలు పలికిన తర్వాత విశ్లేషకుడిగా, మీమ్స్ మేకర్‌గా అంతకుమించిన క్రేజ్ సంపాదించాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్. సౌతాఫ్రికాతో మొదటి టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకి తనదైన స్టైల్‌లో ఓ సలహా ఇచ్చాడు జాఫర్...
‘సౌతాఫ్రికా పిచ్‌లపై ఆడాలంటే ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ అవసరం. ఇండియాలో, ఇంగ్లాండ్ టూర్‌లో ఆడినట్టు కాకుండా ఏడుగురు బ్యాట్స్‌మెన్లతో బరిలో దిగితే బెటర్...
28
అజింకా రహానేకి అవకాశం వస్తుందా? అతను టీమ్‌లో ఉంటాడా? లేదా? అని చాలా పెద్ద చర్చే నడుస్తోంది. అతనికి ఉన్న అనుభవం, విదేశీ పిచ్‌లపై తనకున్న రికార్డుల దృష్ట్యా రహానేకి ఓ ఛాన్స్ ఇవ్వాలి...
38
హనుమ విహారి బెంచ్‌లో వెయిట్ చేస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కానీ, ఇంగ్లాండ్ టూర్‌లో కానీ విహారికి అవకాశం రాలేదు...
48
అయితే తొలి టెస్టులో రహానే ఫెయిల్ అయితే రెండో టెస్టులో హనుమ విహారి టీమ్‌లోకి రావడం అనివార్యం అవుతుంది...
58
నా ఉద్దేశం ప్రకారం భారత జట్టు మొదటి టెస్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఓ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలో దిగాలి...
68
ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫిక్స్. ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే ప్లేస్‌లు కూడా ఫిక్స్...
78
శ్రేయాస్ అయ్యర్‌ని ఆరో స్థానంలో, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆ తర్వాతి స్థానంలో ఆడించాలి. పంత్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్, బుమ్రా, షమీలు వస్తారు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
88
వసీం జాఫర్ అంచనా ప్రకారం తొలి టెస్టు ఆడే భారత జట్టు ఇదే: మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మమ్మద్ సిరాజ్...