భారత జట్టు, బ్రేకులు ఫెయిల్ అయిన బుల్లెట్ ట్రైయిన్‌లా దూసుకుపోతోంది.. - వసీం అక్రమ్

First Published | Oct 24, 2023, 2:45 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా ఐదు మ్యాచులు గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచింది టీమిండియా. ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో న్యూజిలాండ్ మాత్రమే టీమిండియాకి కాస్తో కూస్తో పోటీ ఇవ్వగలిగింది. మిగిలిన మ్యాచులన్నీ వన్‌సైడెడ్‌గానే సాగాయి..

Rohit Sharma

విరాట్ కోహ్లీ 354 పరుగులు చేసి, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉంటే.. రోహిత్ శర్మ 311 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 302 పరుగులతో టాప్ 3లో ఉన్నాడు...

Rohit Sharma

బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 11 వికెట్లు తీస్తే, కుల్దీప్ యాదవ్ 8 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 7 వికెట్లు తీస్తే, ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన మహ్మద్ షమీ 5 వికెట్లు తీశాడు..

Latest Videos


‘భారత జట్టు బ్రేకులు ఫెయిల్ అయిన బుల్లెట్ బండిలా దూసుకుపోతోంది. వారి టీమ్‌లో బలమైన ఆయుధాలు ఉన్నాయి. స్కిల్స్, మెరిట్, అన్నింటికీ మించి ప్లాన్స్‌ని ఎలా అమలు చేయాలో వాళ్లకు బాగా తెలుసు...

Rohit Sharma -Virat Kohli

పరిస్థితికి తగ్గట్టుగా ప్లాన్స్‌ మార్చుకోగలుగుతున్నారు. ఏ ప్లేయర్ అయినా గాయపడితే వారి ప్లేస్‌లో స్టార్లను దించే వెసులుబాటు న్యూజిలాండ్, భారత్ లాంటి జట్లకు ఉంది.. 

హార్ధిక్ పాండ్యా గాయపడినా, శుబ్‌మన్ గిల్ మొదటి రెండు మ్యాచుల్లో ఆడకపోయినా టీమ్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. 

సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారంటే టీమిండియా ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్..

click me!