Bishan Singh
15 ఏళ్ల వయసులో పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్లిన బిషన్ సింగ్ బేడీ, 1974-75 రంజీ సీజన్‌లో 64 వికెట్లు తీశాడు. 1960-1970 దశకంలో భారత జట్టుకి ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ, ముక్కుసూటి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నాడు..
Bishan Singh
370 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన బిషన్ సింగ్ బేడీ, 1560 వికెట్లు తీసి అత్యధిక ఫస్ట్ క్లాస్ తీసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐదు దశాబ్దాలు దాటినా, బిషన్ సింగ్ బేడీ రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు..
Bishan Singh webstory
60 ఓవర్ల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన బిషన్ సింగ్ బేడీ, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. 0.5 ఎకానమీతో బౌలింగ్ స్పెల్ నమోదు చేసిన బౌలర్ బిషన్ సింగ్ ఒక్కడే..
Bishan Singh webstory
1976-77 సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్ జాన్ లీవర్, బాల్‌కి వ్యాజిలెన్ రాశాడు. దీనిపై బిషన్ సింగ్ బేడీ తీవ్ర అభ్యంతరం చెప్పాడు. దీంతో తీవ్ర దుమారం రేగింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఐసీసీ, బంతికి వ్యాజిలిన్ రాయడాన్ని నిషేధించింది.
Bishan Singh webstory
ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌ని స్పిన్ బౌలింగ్ కాదని తీవ్రంగా విమర్శించాడు బిషన్ సింగ్ బేడీ. ‘ముత్తయ్య మురళీధరన్ 1000 టెస్టు వికెట్లు తీయొచ్చు కానీ నా కంటికి అవన్నీ రనౌట్లలాగే కనిపిస్తాయి...’ అంటూ వ్యాఖ్యానించాడు బిషన్ సింగ్ బేడీ..