విరాట్ కోహ్లీ ఆటకు రికార్డులు ఫిదా... డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నయా రికార్డు...

Published : Oct 23, 2023, 07:39 PM IST

ప్రపంచంలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ని చేర్చడానికి విరాట్ కోహ్లీ క్రేజ్ కారణమని స్వయంగా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేస్తున్న విరాట్ కోహ్లీ, డిజిటల్ వరల్డ్ రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్నాడు..  

PREV
15
విరాట్ కోహ్లీ ఆటకు రికార్డులు ఫిదా... డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నయా రికార్డు...
Virat Kohli HotStar

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా ప్రసారం చేస్తోంది. తాజాగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌కి రికార్డు లెవెల్‌లో 4.3 కోట్ల రియల్ టైం వ్యూస్ నమోదయ్యాయి..

25
Rohit Sharma -Virat Kohli

రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్‌ని మొదలెట్టినప్పుడు 1.2 కోట్లుగా ఉన్న రియల్ టైమ్ వ్యూస్, మెల్లిమెల్లిగా రోహిత్ అవుట్ అయ్యే సమయానికి 2 కోట్లకు చేరుకున్నాయి..

35
Virat Kohli

విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చిన తర్వాత 2 కోట్లకు పైగా నమోదైన రియల్ టైం వ్యూస్, రవీంద్ర జడేజాతో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 3 కోట్లను దాటేసింది. విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువైన సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రియల్ టైం వ్యూస్ 4.3 కోట్లను చేరాయి..

45
Virat Kohli

డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్రపంచంలో ఏ క్రీడా ప్రోగ్రామ్‌కైనా ఇదే అత్యధికం. విరాట్ కోహ్లీ 95 పరుగుల దగ్గర అవుట్ కాగానే రియల్ టైం వ్యూస్ అమాంతం 4 కోట్లకు -  3.7 కోట్లకు పడిపోవడం విశేషం..
 

55
Virat Kohli

ఇంతకుముందు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రియల్ టైం వ్యూస్ 3.2 కోట్లుగా నమోదైంది. ఈ మ్యాచ్‌కి ముందు డిస్నీలో ఇదే రికార్డుగా ఉంది..

click me!

Recommended Stories