Team India: సెనా దేశాల్లో అత్యధికంగా 5 వికెట్లు సాధించిన భారత బౌలర్లు

First Published | Mar 14, 2024, 9:49 AM IST

Team India - Top-5 bowlers : దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లను సెనా దేశాలు అంటారు. ఈ నాలుగు దేశాల్లోని బౌన్సీ, స్వింగ్ పరిస్థితులను బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఆయా దేశాల్లో భారత బౌలర్లు అద్భుతమైన ఆటతో రాణించారు. సెనా దేశల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసుకున్న టాప్-5 భారత బౌలర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 
 

Zaheer Khan, Anil Kumble, Jasprit Bumrah

5. భగవత్ చంద్రశేఖర్

సెన దేశాల్లో అత్య‌ధిక సార్లు 5 వికెట్లు సాధించిన భార‌త బౌల‌ర్ల జాబితాలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ 5వ స్థానంలో ఉన్నారు. ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్ సేనా దేశాల్లో 6 సార్లు 5 వికెట్లు సాధించాడు. 1964 నుండి 1979 వరకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రశేఖర్ సెనా దేశాలలో 20 టెస్టులు ఆడాడు.

superstitions of indian cricketers

4. జహీర్ ఖాన్

ఈ జాబితాలో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ 4వ స్థానంలో ఉన్నారు. లెఫ్టార్మ్ పేసర్ సెనా దేశాల్లో 6 సార్లు 5 వికెట్లు తీశాడు. ఈ నాలుగు దేశాలలో 86 గేమ్‌లు ఆడాడు. న్యూజిలాండ్‌లో 4, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో ఒక్కొక్కటి చొప్పున 5 వికెట్లు సాధించాడు. జ‌హీర్ ఖాన్ తన కెరీర్‌లో ఈ దేశాల్లో 86 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 198 వికెట్లు తీసుకున్నాడు.

Latest Videos


3. అనిల్ కుంబ్లే

టీమిండియా దిగ్గ‌జ బౌల‌ర్ అనిల్ కుంబ్లే సెనా దేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. లెగ్ స్పిన్నర్ 6 సార్లు 5 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియాలో కుంబ్లే 4 ఐదు వికెట్లు తీశాడు.న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో ఒక సారి  ఐదు వికెట్లు సాధించాడు. ఈ దేశాల్లో వన్డేలు, టెస్టులు క‌లిపి 109 మ్యాచ్‌లు ఆడి. 219 వికెట్లు పడగొట్టాడు.

Jasprit Bumrah

2. జస్ప్రీత్ బుమ్రా

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 7 సార్లు 5 వికెట్లతో ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లో బుమ్రా 3 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాలో ఒక సారి 5 వికెట్లు సాధించాడు. బుమ్రా ఈ దేశాల్లో 96 గేమ్‌ల్లో 179 వికెట్లు తీసుకున్నాడు. 

1. కపిల్ దేవ్

భారత పేసర్ కపిల్ దేవ్ సేనా దేశాల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. 8 సార్లు 5 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ భారతదేశం కోసం సేనా దేశాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. క‌పిల్ దేవ్ ఆస్ట్రేలియాలో 5, ఇంగ్లాండ్ తో 3 సార్లు 5 వికెట్లు సాధించాడు. అయితే,  న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాలో ఈ ఆల్ రౌండర్ ఎప్పుడూ ఐదు వికెట్లు పడగొట్టలేదు. సెనా దేశాల్లో మొత్తంగా 114 మ్యాచ్‌లు ఆడి మొత్తం 211 వికెట్లు తీశాడు.

click me!