Published : Mar 13, 2024, 05:33 PM ISTUpdated : Mar 13, 2024, 07:44 PM IST
Most IPL Title winning team: మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. 2008 నుండి 2023 వరకు అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..
ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
26
Chennai Super Kings
చెన్నై సూపర్ కింగ్స్
గతేడాది ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 2023లో ఐదో ట్రోఫీని గెలుచుకుంది. గతంలో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021 సంవత్సరాల్లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
36
కోల్‌కతా నైట్ రైడర్స్
2012, 2014 సంవత్సరాల్లో రెండుసార్లు టైటిల్ ను గెలుచుకుని ఐపిఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లను గెలుచుకున్న జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ చోటు సంపాదించుకుంది.
46
సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ అని పేరుతో తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గా పేరు మార్చుకుని ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
56
గుజరాత్ టైటాన్స్
2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు అరంగేట్రం సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతి సీజన్ లో ఫైనల్ వరకు వెళ్లింది కానీ, ఈ సారి ట్రోఫీని గెలవలేకపోయింది.
66
రాజస్థాన్ రాయల్స్
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు, మొదటి టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.