చ‌రిత్ర సృష్టించ‌నున్న అశ్విన్-బెయిర్‌స్టో.. క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది నాలుగో సారి.. !

First Published Mar 6, 2024, 9:54 PM IST

100th Test match: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో చివ‌రి మ్యాచ్ కు ధ‌ర్మ‌శాల వేదిక కానుంది. ఈ మ్యాచ్ ద్వారా భార‌త స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ జానీ బెయిర్ స్టోలు చ‌రిత్ర సృష్టిస్తూ వారిద్ద‌రి 100వ టెస్టు మ్యాచ్ ను క‌లిసి ఆడ‌నున్నారు. 
 

ashwin 1

cricketers who played together in the 100th Test match: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 5వ‌, చివరి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ధర్మశాల వేదిక‌గా జరగనుంది. భారత స్టార్ బౌల‌ర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోలకు ఈ మ్యాచ్‌ చాలా ప్రత్యేకం. ఇద్దరికీ ఇది 100వ టెస్టు మ్యాచ్‌. వీరిద్దరూ గ‌న‌కు ఐదో టెస్టు ప్లేయింగ్-11లో చేరితే స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తారు.

Ravichandran Ashwin, Ashwin

ఇద్దరూ ఆడితే, టెస్టు క్రికెట్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు కలిసి 100వ మ్యాచ్ ఆడడం ఇది నాలుగోసారి అవుతుంది. 2000లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో వెస్టిండీస్‌పై మాజీ ఇంగ్లండ్ కెప్టెన్లు మైఖేల్ అథర్టన్, అలెక్ స్టీవర్ట్ చారిత్రాత్మక ఫీట్ సాధించినప్పుడు ఇది మొదటిసారి జరిగింది.

Image Credit: Getty Images

ఆ త‌ర్వాత ముగ్గురు దిగ్గ‌జ‌ ఆటగాళ్లు సౌతాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, షాన్ పొలాక్, అలాగే, న్యూజిలాండ్‌కు చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కలిసి తమ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఈ ముగ్గురూ 2006లో సెంచూరియన్‌లో జరిగిన దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ మ్యాచ్‌లో భాగంగా ఉన్నారు.

R ashwin

2013లో పెర్త్‌లో జరిగిన ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా యాషెస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కలిసి తమ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడారు.

ర‌విచంద్ర‌న్ అశ్విన్, బెయిర్‌స్టో గురువారం భారత్ vs ఇంగ్లాండ్ తో జరిగే 5వ, చివరి టెస్టులో తమ తమ జట్లకు ప్రాతినిధ్యం వహించ‌డం ఖాయం. దీంతో వీరిద్ద‌రు ఇప్పుడు ఈ ప్ర‌త్యేక జాబితాలో చేరడం ప‌క్కా. మ‌రో విషేశం ఏమిటంటే, కుక్-క్లార్క్ తర్వాత ప్రత్యర్థి జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో తమ 100వ టెస్టు ఆడడం ఇది రెండోసారి.

Rohit Sharma-R Ashwin

అలాగే, భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రారంభమైన ఒక రోజు తర్వాత, న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ-మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కలిసి తమ 100వ టెస్టు ఆడనున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో మార్చి 8 నుండి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండవ టెస్ట్‌లో భాగమైన వెంటనే ఇద్దరూ ఈ ప్ర‌త్యేక లిస్టులో చోటు ద‌క్కించుకోనున్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు క‌లిసి తమ 100వ టెస్ట్‌ను ఆడే ఘనతను సాధించిన 5వ  స్థానానికి చేరుకుంటారు.

click me!