సిడ్నీ టెస్టులో అత్యద్భుత ‘టెస్టు’ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకి చారిత్రక డ్రాను అందించాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి. అయితే ఆ తర్వాత మళ్లీ టీమ్‌లో చోటు దక్కించుకోవడానికి ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది విహారి...
2021 జనవరిలో జరిగిన సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడిన హనుమ విహారి... ఆసీస్‌తో మూడో టెస్టులో టీమిండియాకి చరిత్రాత్మక డ్రా అందించాడు...
211
గాయం కారణంగా గబ్బా టెస్టులో బరిలో దగిన హనుమ విహారి, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ టూర్‌లో, స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు...
311
రెండో టెస్టుకి ముందు కెప్టెన్ అజింకా రహానే వెన్నునొప్పితో బాధపడడం, శ్రేయాస్ అయ్యర్ కడుపునొప్పితో సెలక్షన్‌కి దూరంగా ఉండడంతో లక్కీగా ఏడాది తర్వాత హనుమ విహారికి తుదిజట్టులో చోటు దక్కింది...
411
వచ్చిన అవకాశాన్ని కరెక్టుగా వాడుకున్న హనుమ విహారి... తొలి ఇన్నింగ్స్‌లో రబాడా వేసిన ‘నో బాల్’ను అంపైర్ గుర్తించకపోవడం వల్ల అవుటైయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 40 పరుగులు చేసి మెప్పించాడు...
511
Hanuma Vihari
రెండో ఇన్నింగ్స్‌లో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీలతో రాణించడంతో విరాట్ కోహ్లీ మూడో టెస్టులో కమ్‌బ్యాక్ ఇస్తే... హనుమ విహారి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి...
611
‘రహానే రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే హనుమ విహారి 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒకవేళ రహానే స్థానంలో విహారికి బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే, అతను కూడా ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం దొరికేది...
711
అజింకా రహానే హాఫ్ సెంచరీ చేశాడు కాబట్టి విరాట్ కోహ్లీ కోసం హనుమ విహారిని తప్పించడం సరికాదు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ హనుమ విహారి ఎంతో పర్ఫెక్ట్‌గా సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొన్నాడు...
811
హనుమ విహారి లాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ మ్యాచ్ అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ఆరు నెలలు, ఏడాది పాటు అతన్ని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు...
911
ఇప్పటికే అజింకా రహానే అనేక అవకాశాలు ఇచ్చారు. నాకు తెలిసి విరాట్ కోహ్లీ తర్వాతి టెస్టులో ఎంట్రీ ఇస్తే అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు...
1011
ఐదో స్థానంలో అజింకా రహానే లేదా హనుమ విహారిలలో ఒకరికి అవకాశం దక్కాలి. ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్‌కి రహానేకి అనేక అవకాశాలు ఇచ్చింది.
1111
ఇప్పుడు విహారికి అలాంటి అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...