కుర్రాళ్లను ఆడిస్తే ఓడిపోతామనే భయమా... రాహుల్ త్రిపాఠికి ఛాన్స్ ఇవ్వకుండా ఎన్నాళ్లు తిప్పుతారు...

First Published Dec 10, 2022, 12:35 PM IST

రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమ్‌ నిండా యువరక్తం నిండిపోతుందని అనుకున్నారంతా... రాజకీయాలకు అతీతంగా దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న కొత్త కుర్రాళ్లను ద్రావిడ్ వెలుగులోకి తెచ్చి, స్టార్లుగా మారుస్తాడని ఊహించారు. అయితే జరుగుతున్నది మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం...

Ravi Shastri and Virat Kohli

మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి హయాంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియాలోకి కొత్త కుర్రాళ్లు ప్రవాహంలా దూసుకొచ్చారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్, రుతురాజ్ గైక్వాడ్, టి నటరాజన్, నవ్‌దీప్ సైనీ... ఇలా ఎంతో మంది ప్లేయర్లు టీమ్‌లోకి వచ్చి, వారిలో కొందరు స్టార్లుగా ఎదిగారు..

Sarfaraz Khan

అయితే రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియాలోకి కొత్త కుర్రాళ్లు రావడానికి పెద్దగా అవకాశాలు దొరకడం లేదు. దేశవాళీ టోర్నీల్లో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తూ, ది గ్రేట్ ‘డాన్ బ్రాడ్‌మన్’ ఫస్ట్ క్లాస్ యావరేజ్‌ని మెయింటైన్ చేస్తున్నా సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్టర్లు పట్టించుకోవడం లేదు...

Rahul Tripathi

ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ చూపించి టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రాహుల్ త్రిపాఠి... ఆరు నెలలుగా అంతర్జాతీయ ఆరంగ్రేటం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాత జింబాబ్వే టూర్‌కి ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ టూర్‌కి కూడా వెళ్లాడు...

Image credit: PTI

మూడు సిరీసుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన రాహుల్ త్రిపాఠి, కనీసం బంగ్లా టూర్‌లో అయినా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కుతుందని ఆశించాడు. అయితే బంగ్లాదేశ్ పర్యటనలోనూ త్రిపాఠికి నిరాశే ఎదురైంది.
 

Rahul Tripathi

వరుసగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లను లెక్కకు మించి అవకాశాలు ఇచ్చి... వెనకేసుకు వస్తున్న భారత జట్టు మేనేజ్‌మెంట్... దేశవాళీల్లో దుమ్మురేపుతున్న ప్లేయర్లను మాత్రం పట్టించుకోవడం లేదు. విజయ్ హాజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 524 పరుగులు చేసిన త్రిపాఠి... మరోసారి రిజర్వు బెంచ్‌లోనూ కూర్చున్నాడు...

అలాగే ఐపీఎల్ 2022 సీజన్‌లో సంచలన సెంచరీతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు రజత్ పటిదార్. ఆ తర్వాత దేశవాళీ టోర్నీల్లోనూ అదరగొట్టిన రజత్ పటిదార్, విజయ్ హాజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు. బంగ్లాతో వన్డే సిరీస్‌కి ఎంపికైన రజత్ పటిదార్... రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...
 

Image credit: Getty

కొత్త కుర్రాళ్లను ఆడిస్తూ వారికి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించాల్సిన మేనేజ్‌మెంట్... ఇలా సిరీసుల మీద సిరీసుల్లో రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది... కుర్రాళ్లను ఆడిస్తే మ్యాచులు ఓడిపోతామని టీమిండియా మేనేజ్‌మెంట్ భయపడుతున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
 

click me!