టెస్టు టీమ్‌లో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి ఛాన్స్! 12 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ...

First Published Dec 10, 2022, 10:53 AM IST

బంగ్లాదేశ్‌ టూర్‌కి ముందు గాయపడిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇంకా కోలుకోలేదు. దీంతో అతని స్థానంలో ఎవరిని ఆడిస్తారా? అని చాలా పెద్ద చర్చే జరిగింది. ఉమ్రాన్ మాలిక్ లేదా ముకేశ్ కుమార్ చౌదరికి అవకాశం దక్కొచ్చని ఊహాగానాలు రాగా మరికొందరు నవ్‌దీప్ సైనీకి ఛాన్స్ ఇస్తారని అన్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జయ్‌దేవ్ ఉనద్కట్‌కి టెస్టు టీమ్‌లో చోటు కల్పించింది బీసీసీఐ...

2010లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు జయ్‌దేవ్ ఉనద్కట్. ఆ మ్యాచ్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు జయ్‌దేవ్. ఆ తర్వాత మళ్లీ ఈ సౌరాష్ట్ర కుర్రాడికి అవకాశం దక్కలేదు...

Jaydev Unadkat

2013లో వన్డేల్లో ఆరంగ్రేటం చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, 2016లో టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఘనమైన రికార్డులు క్రియేట్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, టీమిండియా తరుపున అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు...

విజయ్ హాజారే ట్రోఫీలో 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన జయ్‌దేవ్ ఉనద్కట్, కెప్టెన్‌గా సౌరాష్ట్రకు టైటిల్ అందించాడు.  ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉన్న జయ్‌దేవ్ ఉనద్కట్, వీసా ఫార్ములాటీలను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. 

మరికొన్ని రోజుల్లో జయ్‌దేవ్ ఉనద్కట్, బంగ్లాదేశ్ చేరుకోబోతున్నాడు. జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా తప్పుకోవడం, షమీ కూడా అతని దారిలోనే సిరీస్‌కి దూరం కావడంతో జయ్‌దేవ్ ఉనద్కట్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది భారత జట్టు...

ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 86 మ్యాచులు ఆడి 311 వికెట్లు తీసిన జయ్‌దేవ్ ఉనద్కట్, ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా సాధించాడు.

ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకి ఆడిన జయ్‌దేవ్ ఉనద్కట్‌, 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడాడు. 

click me!