రెండో టెస్టులో జరిగిందే, వన్డే సిరీస్‌లోనూ రిపీట్ అవుతుందా... కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ ఇవ్వడంపై...

Published : Jan 07, 2022, 10:08 AM IST

30 ఏళ్లుగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయింది టీమిండియా. అందుకే ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలనే టార్గెట్‌తో సఫారీ గడ్డపై అడుగుపెట్టింది భారత జట్టు. అయితే రెండో టెస్టులో ఆశించిన ఫలితం మాత్రం రాలేదు...

PREV
112
రెండో టెస్టులో జరిగిందే, వన్డే సిరీస్‌లోనూ రిపీట్ అవుతుందా... కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ ఇవ్వడంపై...

29 ఏళ్లుగా విజయాన్ని అందుకోలేకపోయిన సెంచూరియన్‌లో విరాట్ సేన అఖండ విజయాన్ని అందుకుంది. తొలి టెస్టులో సఫారీ జట్టును చిత్తు చేసి టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది...

212

అయితే రెండో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా బరిలో దిగకపోవడం భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. కెఎల్ రాహుల్‌ అనుభవలేమి కారణంగా 240 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేక 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా...

312

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఎప్పుడు 200+ టార్గెట్‌ను కాపాడుకోలేక ఓడింది లేదు. అయితే కోహ్లీ లేని అదే జట్టుతో 240 పరుగుల టార్గెట్‌ను కాపాడలేకపోయాడు కెఎల్ రాహుల్...

412

ఇప్పటిదాకా ప్రత్యర్థికి 200+ టార్గెట్‌ ఇచ్చిన 23 మ్యాచుల్లో విజయాలను అందుకున్న విరాట్ కోహ్లీ, రెండు మ్యాచులను డ్రాలుగా ముగించగలిగాడు... జోహన్‌బర్గ్ టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీయే భారత జట్టు ఎక్కువగా మిస్ అయ్యింది...

512

సౌతాఫ్రికా జరిగిన గత 60 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ 23 మ్యాచుల్లో 17 విజయాలు అందుకుంటే... మిగిలిన భారత కెప్టెన్లు 37 మ్యాచుల్లో 16 విజయాలు మాత్రమే అందుకోగలిగారు...

612

సెంచూరియన్‌లో భారత జట్టుకి తొలి విజయాన్ని అందించి విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టిస్తే... కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో జోహన్‌బర్గ్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది...

712

అయితే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ను కలవరబెడుతున్న విషయం... కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడబోయే వన్డే సిరీస్‌లో కూడా ఫలితం ఇలాగే వస్తుందా? అనే...

812

సెంచూరియన్ టెస్టులో ఆడిన జట్టులోని ప్లేయర్లే జోహన్‌బర్గ్‌లోనూ ఆడారు. వచ్చిన మార్పు విరాట్ కోహ్లీ ప్లేస్‌లో హనుమ విహారి రావడమే. విహారి అంచనాలకు తగ్గట్టే రాణించాడు కూడా...

912

అయినా విజయాన్ని అందించలేకపోయాడు కెఎల్ రాహుల్. ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ ఇదే రిపీట్ అవుతుందా? అని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...

1012

గాయం కారణంగా రెండో టెస్టులో బరిలో దిగని విరాట్ కోహ్లీ, వన్డే సిరీస్‌ నుంచి కూడా విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అదే జరిగితే కోహ్లీ లేని జట్టును కెఎల్ రాహుల్ ఎలా నడిపించగలడనేది అనుమానంగా మారింది...

1112
KL Rahul

ఇప్పటికే గత రెండు ఐపీఎల్ సీజన్లలో కెఎల్ రాహుల్ కెప్టెన్సీని చూశారు అభిమానులు. సత్తా ఉన్న ప్లేయర్లు సమృద్ధిగా ఉన్నా, వారిని ఎలా వాడుకోవాలో తెలియక పరాజయాలు చవిచూశాడు కెఎల్ రాహుల్...

1212

టీమిండియా విషయంలోనూ అదే జరిగితే భారత జట్టు భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. బీసీసీఐ రాజకీయాల కారణంగా టీమిండియా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో, 2023 వరల్డ్‌కప్ పాయింట్ల పట్టికలో స్థానాలు దిగజార్చుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు..

Read more Photos on
click me!

Recommended Stories