rohit rahul
కెఎల్ రాహుల్ మొదటి మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయినా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రోహిత్ శర్మ,నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీ సాధించినా మిగిలిన మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు...
Rohit lifts Kohli
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 220 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ రెండు హాఫ్ సెంచరీలతో విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్, భువీ, షమీ... అంచనాలకు మించి రాణిస్తున్నారు...
Virat Kohli-Suryakumar Yadav
‘నా వరకూ టీమిండియానే టైటిల్ ఫెవరెట్. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తోంది. ఫీల్డింగ్ ఒక్కటీ కాస్త మెరుగు పడాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ స్టాండర్డ్స్ కూడా బాగున్నాయి...
మిగిలిన టీమ్స్‌తో పోలిస్తే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో టాప్ క్లాస్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయితే టోర్నీలో అత్యధిక పరుగులు చేయడం, అత్యధిక వికెట్లు తీయడం కంటే ఎక్కువ మ్యాచులు నెగ్గడం చాలా అవసరం. టీమిండియా ఇప్పటిదాకా బాగానే ఆడుతోంది...
hardik
అయితే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచుల్లో మరో ఛాన్స్ ఉండదు. టీమిండియా స్థాయికి తగ్గట్టు ఆడితే ఏ జట్టునైనా ఓడించగలదు. అందులో ఎలాంటి సందేహం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా...
ఆదివారం గ్రూప్ 2లో మిగిలిన గ్రూప్ మ్యాచులు జరగబోతున్నాయి. టీమిండియా, జింబాబ్వేతో తలబడబోతుంటే సౌతాఫ్రికా జట్టు, నెదర్లాండ్స్‌తో... పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో మ్యాచులు ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితాలను బట్టి సెమీ ఫైనల్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరనేది తేలిపోనుంది..