Litton Das
185 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌కి అదిరిపోయే ఆరంభం అందించాడు ఓపెనర్ లిట్టన్ దాస్. ఓ ఎండ్‌లో నజ్ముల్ హుస్సేన్ షాంటో 16 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేస్తే లిట్టన్ దాస్ మాత్రం భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు... భువీనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి.
Image credit: Getty
అయితే అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన లిట్టన్ దాస్, దినేశ్ కార్తీక్ తప్పిదం కారణంగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లిట్టన్ దాస్ బ్యాటును తాకుతూ వచ్చిన బంతి, దినేశ్ కార్తీక్ గ్లవ్స్‌లోకి వెళ్లే ముందు బౌన్స్ అయినట్టు టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు...
KL Rahul
భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో 6, 4, 4 బాదిన లిట్టన్ దాస్, 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ సూపర్ డైరెక్ట్ త్రోతో లిట్టన్ దాస్‌ని రనౌట్ చేశాడు. లేకపోతే బంగ్లా పరిస్థితి మరోలా ఉండేది...
Litton Das
బ్యాటుతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన లిట్టన్ దాస్‌కి టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బంగ్లా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి తన బ్యాటును కానుకగా ఇచ్చాడు కోహ్లీ...
Litton Das
‘మేమంతా డైనింగ్ హాల్‌లో కూర్చొన్ని డిన్నర్ చేయడానికి రెఢీ అవుతున్నాం. ఆ టైమ్‌లో విరాట్ కోహ్లీ వచ్చి, లిట్టన్‌కి బ్యాటుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ మూమెంట్‌ని లిట్టన్ దాస్ ఎప్పటికీ మరిచిపోలేడు.. అతని కెరీర్‌కి ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) ఛైర్మెన్ జలాల్ యూనస్...