పేరుకి పది మంది పేసర్లు ఉన్నా, టీ20 వరల్డ్ కప్‌లో ఆడేది ఆ నలుగురే... జస్ప్రిత్ బుమ్రాతో పాటు...

Published : Jul 23, 2022, 12:04 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు రకరకాల ప్రయోగాలు చేస్తోంది భారత జట్టు. ఇప్పటికే ఈ ఏడాది ఏడుగురు కెప్టెన్లను మార్చిన టీమిండియా, కొత్త ప్లేయర్లకు కూడా అవకాశాలు ఇస్తోంది. ఈ ఏడాది అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ వంటి యంగ్ పేసర్లు టీమిండియా ద్వారా ఆరంగ్రేటం చేశారు...

PREV
18
పేరుకి పది మంది పేసర్లు ఉన్నా, టీ20 వరల్డ్ కప్‌లో ఆడేది ఆ నలుగురే... జస్ప్రిత్ బుమ్రాతో పాటు...

టీ20 వరల్డ్ కప్ 2022కి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో మెగా టోర్నీ ఆడే జట్టులో ఏయే ప్లేయర్లు ఉంటారనేదానిపై అంచనాలు వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..  తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డారెన్ గోఫ్, టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టు ఫాస్ట్ బౌలర్ల గురించి తన అభిప్రాయాన్ని తెలియచేశాడు..

28

‘జస్ప్రిత్ బుమ్రా... భారత జట్టుకి కీ ప్లేయర్. ప్రపంచంలో బెస్ట్ ఆల్ ఫార్మాట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. కాబట్టి బుమ్రా లేకుండా టీ20 వరల్డ్ కప్ ఆడడం జరగదు. అతను టీమ్‌లో కచ్ఛితంగా ఉంటాడు. టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌లో అతనే గోల్డెన్ కార్డు కూడా...

38
Bhuvneshwar Kumar

భువనేశ్వర్ కుమార్‌కి కూడా జట్టులో చోటు ఉంటుంది. అతను కొత్త బంతితో అద్భుతాలు చేయగలడు. డెత్ ఓవర్లలోనే పరుగులు కట్టడి చేయగలడు. ఆరంభంలో త్వరగా వికెట్లు తీయడం చాలా అవసరం... 

48

ఇంగ్లాండ్, ఇండియా సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ కెపాసిటీ ఏంటో చూశాం. స్కోరు బోర్డును కంట్రోల్ చేసే భువనేశ్వర్ కుమార్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో ప్లేస్ ఉండాల్సిందే...

58

మహ్మద్ సిరాజ్‌ చక్కని పేస్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలో అతని బౌలింగ్ చాలా ఇంప్రెసివ్‌గా సాగింది. కాబట్టి ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కి అతను బాగా ఉపయోగపడతాడు...

68
Image credit: Getty

ఉమ్రాన్ మాలిక్‌లాంటి స్పీడ్ ఉన్న బౌలర్, పరుగులు ఇచ్చినా అతనికి జట్టులో ఉండాలి. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఉమ్రాన్ మాలిక్ మ్యాజిక్ చేయగలడు. ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై అతని పేస్, ప్రత్యర్థికి షాక్‌కి గురి చేస్తుంది..

78

వీరితో పాటు మహ్మద్ షమీ రూపంలో మరో ఆప్షన్ కూడా టీమిండియాకి అందుబాటులో ఉంది. షమీ కూడా బుమ్రాలాంటి కొత్త బంతితో అద్భుతాలు చేయగలడు. బంతి పాతబడిన తర్వాత వికెట్లు కూడా తీయగలడు...

88

అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా అదరగొడుతున్నాడు. చెప్పాలంటే భారత జట్టు దగ్గర పదిమందికి పైగా పేస్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అయితే నాకు తెలిసి టీ20 వరల్డ్ కప్‌‌లో మాత్రం ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలకు అవకాశం ఇస్తే మంచిది...’ అంటూ చెప్పుకొచ్చాడు డారెన్ గోఫ్...

click me!

Recommended Stories