అజారుద్దీన్ రికార్డు బ్రేక్ చేసిన శిఖర్ ధావన్... శుబ్‌మన్ గిల్ రనౌట్‌తో...

Published : Jul 22, 2022, 08:58 PM IST

స్టార్ ప్లేయర్లు లేకుండా బరిలో దిగిన భారత యువ జట్టు, వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ని ఘనంగా ఆరంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి శుభారంభం అందించిన ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్... పలు రికార్డులను బ్రేక్ చేశారు..

PREV
18
అజారుద్దీన్ రికార్డు బ్రేక్ చేసిన శిఖర్ ధావన్...  శుబ్‌మన్ గిల్ రనౌట్‌తో...

18.4 ఓవర్లలో తొలి వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్. 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్...  రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 

28

వెస్టిండీస్‌లో వన్డేల్లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్... 22 ఏళ్ల 215 రోజుల వయసులో విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌లో వన్డేల్లో 50+ స్కోరు నమోదు చేయగా, శుబ్‌మన్ గిల్ వయసు ప్రస్తుతం 22 ఏళ్ల 317 రోజులు...

38

శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ బ్యాటింగ్ సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ జోడిని గుర్తుకు తెచ్చింది. ధావన్, టెండూల్కర్‌లా ఆడితే... శుబ్‌మన్ గిల్, వీరేంద్ర సెహ్వాగ్‌ల బౌండరీలతోనే డీల్ చేశాడు...

48

క్రీజులో ఉన్నంతసేపు వీరేంద్ర సెహ్వాగ్‌లా బ్యాటింగ్ చేసిన శుబ్‌మన్ గిల్, పరుగు తీసేటప్పుడు బద్ధకం ప్రదర్శించి వికెట్ పారేసుకున్నాడు. కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన గిల్, సింగిల్ తీయడంలో కాస్త వేగం చూపించి ఉంటే సెంచరీ మార్కు అందుకునేవాడే...

58

వెస్టిండీస్‌లో భారత జట్టుకి వన్డేల్లో తొలి వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం మూడో అత్యధికం. ఇంతకుముందు శిఖర్ ధావన్, రహానేతో కలిసి 132 పరుగులు, రోహిత్ శర్మతో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

68
Image credit: Getty

వెస్టిండీస్‌లో శిఖర్ ధావన్‌కి ఇది ఐదో 50+ స్కోరు. విరాట్ కోహ్లీ 7 సార్లు 50+ స్కోరు చేసి టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ ఐదు సార్లు ఈ ఫీట్ సాధించి ధావన్‌తో సమానంగా ఉన్నాడు.. 

78
Shikhar Dhawan

శిఖర్ ధావన్‌కి ఇది 150వ వన్డే. తొలి 150 వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. హషీమ్ ఆమ్లా 57, విరాట్ కోహ్లీ, వీవిన్ రిచర్డ్స్ 55 సార్లు 50+ స్కోర్లు చేయగా శిఖర్ ధావన్‌కి ఇది 53వ 50+ స్కోరు... 

88

అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు. ప్రస్తుతం ధావన్ వయసు 36 ఏళ్ల 229 రోజులు...

Read more Photos on
click me!

Recommended Stories