గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు హార్ధిక్ పాండ్యా. ఇంగ్లాండ్ టూర్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, ఐర్లాండ్ టూర్‌లో భారత జట్టుకి సారథిగా వ్యవహరించాడు...
హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఇరగదీస్తుండడంతో టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో మిగిలిన ఆల్‌రౌండర్లకు అవకాశం దక్కుతుందా? అనేది డౌటే.. హార్ధిక్ పాండ్యాకి బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది...
29
ఐపీఎల్ 2021 సీజన్‌లో సెకండాఫ్‌లో ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్, టీమిండియా తరుపున చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయ్యర్ ఫెయిల్ అయ్యాడని చెప్పేకంటే, అతన్ని టీమిండియా సరిగ్గా వాడుకోలేకపోయిందని చెప్పడం కరెక్టుగా ఉంటుంది...
39
వెంకటేశ్ అయ్యర్ ఆకట్టుకోలేకపోవడంతో హార్ధిక్ పాండ్యాకి బ్యాకప్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ లేదా దీపక్ చాహార్‌లను ఆడించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఐపీఎల్‌కి ముందు గాయపడిన దీపక్ చాహార్ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు...
49
Shardul Thakur-Deepak Chahar
అతను ఆసియా కప్ 2022 టోర్నీకి అందుబాటులో ఉండడం అనుమానంగానే మారింది. దాదాపు ఆరు నెలలకు పైగా క్రికెట్‌కి దూరంగా ఉన్న దీపక్ చాహార్‌కి ఆడించడం కంటే శార్దూల్ ఠాకూర్‌ని బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా ఆడించేందుకే బీసీసీఐ మొగ్గుచూపొచ్చు...
59
‘శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్ కావడం వల్లే అతను ఇంకా టీమిండియాలో ఛాన్సులు దక్కించుకోగలుగుతున్నాడు. అయితే హార్ధిక్ పాండ్యాతో పోలిస్తే శార్దూల్ ఠాకూర్ అసలు ఆల్‌రౌండర్ కిందకే రాడు...
69
ఎందుకంటే శార్దూల్ ఠాకూర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కి సెట్ అయ్యే ఆల్‌రౌండర్ కాదు. హార్ధిక్ పాండ్యా ఏ ఫార్మాట్ అయినా ఆల్‌రౌండ్ పర్పామెన్స్ ఇవ్వగలడు. అలా చూసుకుంటే శార్దూల్ ఠాకూర్‌ని ఆల్‌రౌండర్ అనడం కూడా కరెక్ట్ కాదు...
79
మిగిలిన ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆల్‌రౌండర్ ప్లేస్ కోసం శార్దూల్ ఠాకూర్ పోటీలో నిలిచి ఉండొచ్చు. అయితే అతను ఇప్పటిదాకా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో టీమిండియాని గెలిపించిన మ్యాచులన్నీ టెస్టులే...
89
టెస్టుల్లో నాలుగు డాట్ బాల్స్ ఆడిన తర్వాత ఓ బౌండరీ కొడితే సరిపోతుంది. ఏడు, ఎనిమిది వికెట్లు పడిన తర్వాత మెరుపులు మెరిపించినంత మాత్రాన ఆల్‌రౌండర్ అనలేం...
99
ఆల్‌రౌండర్ అని చెప్పుకోవాలంటే లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించడం కాదు, అవసరమైతే టాపార్డర్ బ్యాటర్‌తో కలిసి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు నిర్మించగలగాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్...