విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ కెరీర్, వెస్టిండీస్ సిరీస్‌తోనే మొదలు కానుంది. భారత జట్టుకి ఇది 1000వ వన్డే మ్యాచ్ కూడా కావడంతో ప్రతిష్టాత్మకంగా మారింది...
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానని కామెంట్ చేశాడు నయా కెప్టెన్ రోహిత్ శర్మ...
212
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కి ఓపెనర్లుగా ఎంపికైన శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారిన పడడంతో 10 రోజులకి పైగా జట్టుకి దూరం కానున్నారు...
312
మరో ఓపెనర్ కెఎల్ రాహుల్, తన సోదరి విహహా వేడుకకు హాజరు అయ్యేందుకు మొదటి వన్డేకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. రెండో వన్డే సమయానికి కూడా కెఎల్ రాహుల్ జట్టులో కలవడం కష్టమే...
412
దీంతో మయాంక్ అగర్వాల్‌తో పాటు టీ20 సిరీస్‌కి ఎంపికైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌లను వన్డే సిరీస్‌కి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు...
512
ఇప్పటికే మయాంక్ అగర్వాల్ క్వారంటైన్‌లో ఉండగా, ఇషాన్ కిషన్ క్వారంటైన్ పూర్తి చేసుకుని భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు...
612
‘వన్డే సిరీస్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తా... వేరే ఆప్షన్స్ కూడా ఏమీ లేవుగా...’ అంటూ కామెంట్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ...
712
అయితే రోహిత్ కామెంట్లపై అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. మయాంక్ అగర్వాల్ రూపంలో జట్టుకి ఓ ఓపెనర్ అందుబాటులో ఉన్నా ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ కావడంతో అతన్ని ఆడిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
812
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కి తుదిజట్టులో అవకాశం ఇచ్చినా, అతన్ని సరిగ్గా వాడుకోలేదు రోహిత్ శర్మ...
912
ముంబై ఇండియన్స్ మాజీ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి టీమిండియాలో చోటు పోకుండా ఉండేందుకే వెంకటేశ్ అయ్యర్‌ను సరిగా వాడుకోవడం లేదంటూ ఆ సమయంలో ట్రోల్స్ వచ్చాయి...
1012
ఇప్పుడు ఇషాన్ కిషన్ విషయంలోనూ ఇలాంటి ట్రోల్స్ రావడంతో భవిష్యత్తులో టీమిండియాను ముంబై ఇండియన్స్ జట్టుగా మార్చేస్తారా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...
1112
ముంబై ఇండియన్స్ ప్లేయర్లు, ఆడిన మాజీ ప్లేయర్లతో జట్టుని నింపేసి, వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తావా రోహిత్... అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు...
1212
ముంబై ఇండియన్స్‌గా మార్చినా పర్లేదు, అక్కడ ఐపీఎల్ టైటిల్స్ గెలిచినట్టు... భారత జట్టుతో ఐసీసీ టైటిల్స్ గెలిస్తే చాలు... అంటున్నారు భారత అభిమానులు...