కుంబ్లే తో కోహ్లి విభేదాలకు కారణమదే.. సంచలన విషయాలు వెల్లడించిన టీమిండియా మాజీ మేనేజర్

Published : Feb 05, 2022, 02:03 PM IST

Virat Kohli-Anil Kumble: భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి.. మాజీ కోచ్  అనిల్ కుంబ్లేలు కలిసి పనిచేసింది కొంత కాలమే అయినా ఆ ఇద్దరి మధ్య నిత్యం విభేదాలే.. కలహాల కాపురంగా మారిన  కోచ్-కెప్టెన్ విభేదాలు భారత  జట్టు ఆటపై కూడా ప్రభావం చూపాయి.  

PREV
18
కుంబ్లే తో కోహ్లి విభేదాలకు కారణమదే.. సంచలన విషయాలు వెల్లడించిన టీమిండియా మాజీ మేనేజర్

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి-మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే  లు కలిసి పనిచేసింది ఏడాది కాలమే అయినా నిత్యం కలహాల కాపురంగానే సాగింది వాళ్ల ప్రయాణం. కానీ ఆ తర్వాత కోహ్లి-కుంబ్లే ఓ విఫల ప్రయోగమని భావించిన సెలెక్టర్లు.. కుంబ్లే ను హెడ్ కోచ్  నుంచి తప్పించారు. ఆ  బాధ్యతలను మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అప్పగించారు.

28

కోహ్లి.. కుంబ్లే లకు విభేదాలకు కారణమేంటి..? అనే విషయమై  అప్పటి టీమిండియా మేనేజర్  రత్నాకర్ శెట్టి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాజాగా  రత్నాకర్ శెట్టి.. 'On board: Test, Triumph, My Years in BCCI’ పేరుతో   ఓ పుస్తకాన్ని రచించాడు.  ఈ పుస్తకంలో ఆయన సంచలన విషయాలను వెల్లడించాడు. 

38

‘2016 లో ఐపీఎల్ ఫైనల్  మ్యాచ్ కోసం నేను హైదరాబాద్ వెళ్లాను. అక్కడ  కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) సమావేశం జరిగింది. అందులో  కమిటీ సభ్యులు  వినోద్ రాయ్, డయానా ఎడల్జీ తో పాటు అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లి, నేనూ వర్చువల్ గా పాల్గొన్నాం.  
 

48

ఆ సమావేశంలో టీమిండియా భవిష్యత్ ప్రణాళికలు, హెడ్ కోచ్ గా ఎవరిని ఎంపిక చేద్దామనే విషయాలను గురించి  శ్రీధర్.. అందరి అభిప్రాయాలను అడిగారు. తిరిగి ఆయనే మళ్లీ కలుగజేసుకుని కుంబ్లేనే కొనసాగిద్దాం అని  చెప్పారు. దాంతో నేనూ, కుంబ్లే షాకయ్యాం... కానీ ఆ తర్వాత  కొద్దిరోజులకు  కుంబ్లే ను కోచ్ గా కొనసాగించడానికి పలువురు అనాసక్తిగా ఉన్నారని అర్థమైంది.

58

ఇక 2017  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు లండన్ లో మరో సమావేశం జరిగింది. దానికి కూడా కుంబ్లే, కోహ్లితో పాటు శ్రీధర్ వంటి పలువురు బీసీసీఐ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. కుంబ్లే  ఆటగాళ్లకు అండగా  నిలువడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ లో ఉద్రిక్త విభేదాలు సృష్టిస్తున్నాడని కోహ్లి  భావించాడు. అదే విషయాన్ని సమావేశంలో కూడా పంచుకున్నాడని నాకు తర్వాత తెలిసింది.

68

చివరికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిన అనంతరం అనిల్ కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు..’ అని రత్నాకర్ రాసుకొచ్చాడు.  

78

విరాట్, కుంబ్లే లు ఒకే ఆలోచన విధానంతో లేరని ఆ కారణంగానే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు శెట్టి తన పుస్తకంలో పేర్కొన్నాడు.   అప్పటికే టెస్టులతో పాటు వన్డేలలో కూడా  విరాట్ ప్రభంజనం కొనసాగుతుండటంతో కెప్టెన్ మాటే నడిచిందని తన పుస్తకంలో పొందుపరిచాడు.

88

కాగా 2016 లో టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైన అనిల్ కుంబ్లే..ఏడాది పాటే ఆ బాధ్యతల్లో ఉన్నాడు.  2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు ఓటమి అనంతరం తప్పుకున్నాడు. 2017 నుంచి  2021 సెప్టెంబర్ వరకు  రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories