మెగా వేలానికి ముందు ఆ జట్లకి షాక్... ఐపీఎల్ ఫస్టాఫ్‌కి ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం...

Published : Feb 05, 2022, 02:59 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి కౌంట్‌ డౌన్ మొదలైంది. ఐపీఎల్ మెగా వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు.. అయితే ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు ఆసీస్ క్రికెటర్లు అందుబాటులో ఉండడం లేదు...

PREV
111
మెగా వేలానికి ముందు ఆ జట్లకి షాక్... ఐపీఎల్ ఫస్టాఫ్‌కి ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది ఆస్ట్రేలియా జట్టు. అయితే వివిధ కారణాల వల్ల ఆ టూర్ వాయిదా పడింది...

211

పాక్‌లో పర్యటనకి వెళ్లిన న్యూజిలాండ్ సెక్యూరిటీ కారణాలతో వన్డే మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు తప్పుకున్న విషయం తెలిసిందే.., ఇంగ్లాండ్‌ జట్టు కూడా ఇదే బాట పట్టింది...

311

పాక్‌లో పర్యటనకి వెళ్లిన న్యూజిలాండ్ సెక్యూరిటీ కారణాలతో వన్డే మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు తప్పుకున్న విషయం తెలిసిందే.., ఇంగ్లాండ్‌ జట్టు కూడా ఇదే బాట పట్టింది...

411

తాజాగా పాక్‌లో పర్యటించేందుకు తిరిగి షెడ్యూల్‌ను ఖరారు చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ పర్యటనలో ఆసీస్, పాకిస్తాన్ జట్లు మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది...

511

మార్చి 4 నుంచి రావల్పిండిలో మొదటి టెస్టుతో మొదలయ్యే పాకిస్తాన్ టూర్, ఏప్రిల్ 5 వరకూ జరుగుతుంది. ఆ తర్వాతే ఐపీఎల్‌కి రావాల్సి ఉంటుంది ఆసీస్ క్రికెటర్లు...

611

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త జట్లు వస్తుండడంతో మార్చి 27 నుంచే లీగ్‌ మ్యాచులను ప్రారంభించాలని చూస్తోంది బీసీసీఐ. త్వరలో షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది...

711

మార్చి 5న పాక్ టూర్‌ను ముగించుకునే ఆస్ట్రేలియా ప్లేయర్లు, ఆ తర్వాత ఐపీఎల్‌లో పాల్గొనే ముందు ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది...

811

మార్చి 27 నుంచి లీగ్ మ్యాచులు ప్రారంభమైతే, ఏప్రిల్ 10 సమయానికి దాదాపు అన్నీ ఫ్రాంఛైజీలు రెండు నుంచి మూడు మ్యాచులు ఆడేస్తాయి...

911

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, మాథ్యూ వైడ్, క్రిస్ లీన్, ఆండ్రూ టై వంటి ప్లేయర్లు పాల్గొనబోతున్నారు...

1011

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అతను కూడా లేటుగా జట్టులో చేరే అవకాశం ఉంది...

1111

అలాగే గత మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను లక్నో సూపర్ జెయింట్ టీమ్‌ డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసింది...

click me!

Recommended Stories