టీ20 వరల్డ్‌ కప్‌కి 2 నెలల ముందే ఇండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్... వచ్చే ఏడాది పాక్‌ పర్యటనకు!...

Published : Jul 07, 2022, 11:52 AM IST

దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్‌కి ఏదీ సాటిరాదు. ఇరుదేశాల ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచులు చూడాల్సి వస్తోంది... అయితే ఏడాది గ్యాప్‌లో మూడుసార్లు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచులు జరగబోతున్నాయి...

PREV
16
టీ20 వరల్డ్‌ కప్‌కి 2 నెలల ముందే ఇండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్... వచ్చే ఏడాది పాక్‌ పర్యటనకు!...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో మొట్టమొదటిసారి ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ చేతుల్లో పరాజయం ఎదుర్కొంది టీమిండియా. 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒకటికి రెండు అవకాశాలు, భారత జట్టు ముందుకు వచ్చాయి...

26

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి రెండు నెలల ముందే ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో తలబడబోతోంది టీమిండియా. ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ జరగనుంది...

36

షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఆసియా కప్‌ను లంక బోర్డు నిర్వహించగలదా? అనే అనుమనాలు ఎదురైనా... ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ సక్సెస్ కావడంతో ఆ డౌట్స్ అన్నీ మటుమాయమయ్యాయి...

46

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన రెండు నెలలకే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు ఎప్పుడో బుకింగ్ ఓపెన్ చేసిన 3 నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి.  

56

2021 నుంచి 2022 ఏడాదిలో మూడు సార్లు ఇండో పాక్ మధ్య టీ20 మ్యాచులను చూసే అవకాశం కలగనుంది... వచ్చే ఏడాది భారత్ వేదికగా ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది. దానికి ముందు పాకిస్తాన్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో అడుగుపెట్టని టీమిండియా, ఆసియా కప్‌లో పాల్గొంటుందా అనేది అనుమానంగా మారింది...

66

భారత జట్టు, ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కి రాకపోతే, తాము ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోమని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కామెంట్లు చేయడం విశేషం. ఈ రెండు టోర్నీలు సజావుగా జరిగితే వచ్చే ఏడాది మరో రెండుసార్లు భారత్, పాకిస్తాన్ మ్యాచులను చూడొచ్చు..

click me!

Recommended Stories