సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్నా... పుట్టినరోజున సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన సురేష్ రైనా...

First Published Nov 23, 2020, 8:38 PM IST

భారత జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగి, ఆ తర్వాత టీమ్‌లో ప్లేస్ కోల్పోయాడు సురేష్ రైనా. టీమిండియాలో చోటు రాకపోయినా ఐపీఎల్‌లో అదరగొడుతూ ‘మిస్టర్ ఐపీఎల్‌’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘చిన్న తలా’గా పేరొందిన సురేష్ రైనా 34వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని మొదలెట్టాడు సురేష్ రైనా. 

రైనా కూతురు గ్రేసియా పేరున ‘గ్రేసియా రైనా ఫౌండేషన్’ ప్రారంభించిన రైనా, యువ అన్‌స్టాపబుల్‌తో కలిసి భారతదేశంలోని 34 ప్రభుత్వ స్కూళ్లకు అవసరమైన టాయిలెట్లు, తాగు నీరు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అందించబోతున్నారు.
undefined
సురేష్ రైనా ఈ కార్యక్రమం ద్వారా సుమారు 10 వేల పేద విద్యార్థులకు సాయం అందబోతోంది. తన పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సురేష్ రైనా... ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
undefined
Suresh Raina
undefined
ఓ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు సురేశ్ రైనా...
undefined
‘సమాజం నాకెంతో ఇచ్చింది, ఇప్పుడు తిరిగి ఇచ్చేయాల్సిన సమయం వచ్చింది. 34వ పుట్టినరోజున ఈ స్పెషల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు సురేష్ రైనా.
undefined
టీమిండియా తరుపున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులుఆడిన సురేష్ రైనా... అన్ని ఫార్మాట్లలో కలిపి 8 వేల దాకా పరుగులు చేశాడు.
undefined
భారత మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి అత్యంత ఆప్తుడిగా పేరొందిన సురేష్ రైనా... ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్ చేరిన సురేష్ రైనా... తన మామ ఇంటికి దుండగులు దాడి చేయడంతో ఆకస్మాత్తుగా స్వదేశం తిరిగి వచ్చాడు. ఈ దాడిలో రైనా మామ చనిపోయిన సంగతి తెలిసిందే.
undefined
స్వదేశం తిరిగొచ్చిన తర్వాత తన సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్‌లో క్రికెట్ అకాడమీ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న సురేష్ రైనా... తన పుట్టినరోజున చిన్నారులతో కలిసి కాసేపు క్యారెమ్స్ కూడా ఆడాడు.
undefined
click me!