ముంబై క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కి ఆసీస్ టూర్‌లో చోటు దక్కకపోవడంతో భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
బ్యాటింగ్‌లో ఇంతగా రాణిస్తున్నా, జట్టులో స్థానం దక్కకపోవడంతో టీమిండియాలోకి రావాలంటే సూర్యకుమార్ యాదవ్ ఇంకేం చేయాలంటూ సెలక్టర్ల తీరును ప్రశించారు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్...
తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న విండీస్ మాజీ దిగ్గజం బ్రియాన్ లారా... ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
‘సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి బ్యాట్స్‌మెన్. ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో అతని పాత్ర మరువలేనిది. టీమిండియాలో అతనికి స్థానం దక్కాల్సిందే..
వన్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు... ఈ స్థానంలో రాణించాలంటే చాలా టాలెంట్ ఉండాలి. అలాంటి సత్తా సూర్యకుమార్‌కి ఉంది..
అతడిని ఇంతవరకూ భారత జట్టులోకి ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కావడం లేదు... వేరే జట్టులో ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు... జాతీయ జట్టుకి ఆడే అర్హత లేదా..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బ్రియాన్ లారా.
ఒత్తిడిలో ఉన్నప్పుడు రాణించడం అనేది చాలా తక్కువ మంది ప్లేయర్లలో ఉండే లక్షణం, ఆ టాలెంట్ సూర్యకుమార్ యాదవ్‌కి ఉంది... అతనో క్లాస్ ప్లేయర్...
సూర్యకుమార్ యాదవ్ ఓ టెక్నిక్‌తో బ్యాటింగ్ చేస్తాడు... చాలా కూల్‌గా ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు... ’ అని చెప్పాడు బ్రియాన్ లారా.
ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేసిన సూర్యకుమార్ యాదవ్ పేరు లేకపోవడం చూసి చాలా బాధపడ్డానని చెప్పిన బ్రియాన్ లారా... సత్తా ఉన్న క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహించాల్సిన బాధ్యత సెలక్టర్లకు ఉందని చెప్పారు.