ఆ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లపై సీరియస్ అయిన ధోనీ... ఆ దెబ్బకు ఏం జరిగిందంటే...

First Published Feb 2, 2023, 1:37 PM IST

టీమిండియాలోనే కాదు, వరల్డ్ క్రికెట్‌లో ‘మిస్టర్ కూల్’, ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా నవ్వుతూ కూల్‌గా కనిపించాడు మెంటర్ ధోనీ. అలాంటి ధోనీ, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లపై సీరియస్ అయ్యాడు. ఈ విషయాన్ని బయటపెట్టాడు టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్..

MS Dhoni

తన ఆటో బయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్- మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్’ పుస్తకంలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్లేయర్ల గురించి చాలా రహస్యాలు బయటపెట్టిన ఆర్ శ్రీధర్... 2014లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచు గురించి ప్రస్తావించాడు...

MS Dhoni

‘భారత జట్టులోకి నేను వచ్చిన కొత్తలో మహేంద్ర సింగ్ ధోనీ చెప్పే విషయాలను చాలా జాగ్రత్తగా గమనించేవాడిని. టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం వచ్చిందని ధోనీ గుర్తించాడు..

MS DHONI

అక్టోబర్ 2014లో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో మేం ఈజీగా గెలవాల్సింది. అయితే ఫీల్డింగ్‌లో చేసిన తప్పుల కారణంగా ఆ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ధోనీ, ఆ మ్యాచ్‌లో ప్లేయర్లు ఫీల్డింగ్ చేయడానికి ఇబ్బంది పడడం చూసి షాక్ అయ్యాడు...

ms dhoni

భారత జట్టు ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ ఎంత ఘోరంగా పడిపోయాడో గమనించాడు. ఆ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో అందరికీ క్లియర్‌గా ఓ విషయాన్ని చెప్పాడు. ఫిట్‌నెస్ స్టాండర్డ్స్‌ని అందుకోకపోతే ఏ ప్లేయ్ కూడా వరల్డ్ కప్ ఆడడని క్లారిటీ ఇచ్చాడు...

ఏ ఒక్కరి పేరు చెప్పకుండా ఫీల్డింగ్ ఎంత చెత్తగా ఉందో చూసుకోవాలని హెచ్చరించాడు. ధోనీని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. అయితే ఆ తర్వాత టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా మెరుగయ్యాయి. అందరూ ఫిట్‌నెస్‌పైన ఫోకస్ పెట్టారు...’ అంటూ రాసుకొచ్చాడు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

click me!