ధోనీ వెళ్లాక ఆ ప్లేస్ నాదే కదా! నాకిది చాలా చిన్న విషయం.. - టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

First Published Feb 2, 2023, 12:23 PM IST

నేచురల్‌గానే హార్ధిక్ పాండ్యా యాటిట్యూడ్, బిహేవియర్ కాస్త ఓవర్‌గా ఉంటాయని చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయం.. మనోడి ఆటను గమనిస్తూ వచ్చిన వారందరికీ ఈ విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగిస్తే.. మామూలుగా ఉండదు. ఇప్పుడు టీ20ల్లో టీమిండియా ఆటతీరు చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫీలవుతోంది ఇదే.. 

Image credit: PTI

టీమ్‌లో నలుగురు స్పెషలిస్టు బౌలర్లు ఉన్నా, ఎవ్వరికీ బౌలింగ్ రానట్టుగా తానే ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేస్తున్నాడు హార్ధిక్ పాండ్యా. తొలి టీ20లో భారీగా పరుగులు ఇచ్చినా మొదటి ఓవర్ వేయడం మానుకోని హార్ధిక్ పాండ్యా, మూడో టీ20లో 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు..
 

Hardik Pandya

3 మ్యాచుల్లో 66 పరుగులు చేసి 5 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 168 పరుగుల తేడాతో పొట్టి ఫార్మాట్‌లో భారీ విజయం అందుకున్న భారత కెప్టెన్‌గా నిలిచాడు...

Image credit: PTI

‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్ నాకు రావడం కరెక్ట్ అనిపించడం లేదు. ఎందుకంటే టీమ్‌లో చాలామంది ప్లేయర్లు బాగా ఆడారు. ఈ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు, ట్రోఫీ పూర్తి సపోర్టింగ్ స్టాఫ్‌కి దక్కాలి. వాళ్లు టీమ్‌‌కి అన్ని వేళలా అండగా నిలుస్తున్నారు...
 

Image credit: PTI

నిజం చెప్పాలంటే నాకు ఇలా ఆడడం చిన్నప్పటి నుంచే వచ్చిన విద్య. జట్టుకి ఏం కావాలో దానికి తగ్గట్టుగా నా ఆటతీరుని మార్చుకుంటూ ఉంటా. నా కెప్టెన్సీ చాలా సింపుల్. నా గట్స్‌కి పరీక్ష పెడతా... నేను పడిపోవడం అంటూ జరిగితే, అది చనిపోయాకే అనేది నా రూల్...
 

Image credit: PTI

మాహీ భాయ్‌లా బ్యాటింగ్ ఆర్డర్‌లో కింద వచ్చి, ఫినిషర్ రోల్ పోషించడానికి నేనెప్పుడూ సిద్ధమే. నేను చిన్నతనం నుంచే గ్రౌండ్‌కి అన్నివైపులా సిక్సర్లు కొడుతూ వచ్చాను.

Image credit: PTI

అయితే ధోనీ రిటైర్ అయ్యాక ఆ బాధ్యత నాకే వచ్చింది. ఆ బాధ్యత తీసుకుని పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
 

click me!